రేపు ఏలూరుకు రానున్న కేంద్ర బృందం
ఏలూరు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న అంతుచిక్కని వింత వ్యాధి లక్షణాలను కనుగొనేందుకు కేంద్రం ముగ్గురు డాక్టర్ల బృందాన్ని పశ్చిమ గోదావరి జిల్లాకు పంపుతోంది..
ఏలూరు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న అంతుచిక్కని వింత వ్యాధి లక్షణాలను కనుగొనేందుకు కేంద్రం ముగ్గురు డాక్టర్ల బృందాన్ని పశ్చిమ గోదావరి జిల్లాకు పంపుతోంది.. రేపు ఏలూరుకు రానున్న ఈ టీమ్ వ్యాధి లక్షణాలు, కారకాలు, క్షేత్ర స్థాయిలో పరిస్థితిని కూలంకషంగా చర్చించి ఒక నివేదికను రూపొందిస్తారు. ఈ బృందంలో ఎయిమ్స్ ప్రొఫెసర్ డాక్టర్ జంషేడ్ నయ్యర్, పుణేకు చెందిన వైరాలజిస్ట్ డాక్టర్ అవనీష్ దియోస్తావర్, NCDC డిప్యూటీ డైరక్టర్ డాక్టర్ సంకేత్ కులకర్ణి ఉన్నారు. వీరు రోగులను పరీక్షించడమే కాక, వారికి సంబంధించిన అన్ని శాంపిల్స్, స్థానికంగా ఉన్న నీరు, గాలి, శాంపిల్స్ కూడా సేకరించి అధ్యయనానికి పంపుతారు.