ఏపీ మూడు రాజధానుల విషయంలో కేంద్రం మరింత క్లారిటీ ఇచ్చింది. మూడు రాజధానులపై ఏపీ హైకోర్టులో కేంద్రం అదనపు అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ అఫిడవిట్‌లో కేంద్రం పలు కీలక అంశాలను ప్రస్తావించింది. ఇదే అంశంపై కేంద్ర హోంశాఖ.. హైకోర్టులో అదనపు అఫిడవిట్ దాఖలు చేసింది. మూడు రాజధానుల్లో కేంద్రం పాత్రపై మరింత క్లారిటీ ఇచ్చింది. విభజన చట్టం ప్రకారం మూడు రాజధానులు తప్పులేదని కేంద్రం తేల్చిచెప్పింది. విభజన చట్టంలో ఒకే రాజధాని ఉండాలని ఎక్కడా లేదని స్పష్టం చేసింది. 3 రాజధానులపై కేంద్రం పాత్రపై పిటిషనర్ దోనే సాంబశివరావువి అపోహలేనని హోంశాఖ వెల్లడించింది. రాజధానికి అవసరమైన ఆర్థిక సాయం చేస్తామని మాత్రమే చెప్పామని పేర్కొంది. రాజధాని లేదా రాజధానుల నిర్ణయంలో జోక్యం ఉండబోదని హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో కేంద్రం స్పష్టీకరించింది.