CM Ramesh Tests Positive for Coronavirus: సీఎం రమేశ్ కి కరోనా పాజిటివ్
CM Ramesh Tests Positive: కరోనా వైరస్ ఎవ్వరినీ వదలట్లేదు. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు అందరూ కరోనా బారిన పడుతున్నారు.
CM Ramesh Tests Positive: కరోనా వైరస్ ఎవ్వరినీ వదలట్లేదు. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు అందరూ కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే పలువురు రాజకీయ, సినీ ప్రముఖులకు కరోనా సోకగా.. తాజాగా బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ కు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం తాను బాగానే ఉన్నానని వైద్యుల సూచనమేరకు హైదరాబాద్‌లో హోమ్ ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. పాజిటివ్‌గా నిర్ధారణ అయినప్పటికీ ఎలాంటి ఆనారోగ్య సమస్యలు లేవని తెలిపారు.
భారత్‌లో కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో కేసుల సంఖ్య 20 లక్షల 27 వేలు దాటింది. దేశంలో మొత్తం 20,27,075 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 6,07,384 ఉండగా, 13,78,105 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా 41,585 మంది కరోనా వ్యాధితో మరణించారు.
I have tested positive for #COVID__19. Whilst I am doing fine, I am being under isolation on the recommendation of doctors.
— CM Ramesh (@CMRamesh_MP) August 7, 2020