NTR Birth Anniversary: ఎన్టీఆర్ జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలి...బాలయ్య
NTR's Birth Anniversary: ఎన్టీఆర్ 98వ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద తనయుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ నివాళులు అర్పించారు.
NTR Birth Anniversary: ఎన్టీఆర్ జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని ఎప్పటి నుంచో కోరుతున్నామని... ఇదే విషయాన్ని మరోమారు డిమాండ్ చేస్తున్నట్టు ఎన్టీఆర్ తనయుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తెలిపారు. ఈ రోజు ఎన్టీఆర్ 98వ జయంతిని పురస్కరించుకుని ఈ ఉదయం ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నందమూరి తారకరామారావు జీవిత చరిత్రను పాఠ్యాంశాలలో చేర్చాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్‌పై ఎంతోమంది పుస్తకాలు రాశారని గుర్తు చేసిన బాలకృష్ణ.. ఎన్టీఆర్ యుగపురుషుడని, పేదల పెన్నిధి అని బాలకృష్ణ కొనియాడారు. తన తండ్రి సినిమాలు చూసి తాను స్ఫూర్తి పొందానని చెప్పారు.
ఆనందయ్య మందు పై నాకు నమ్మకం వుంది...
బాలయ్య ఆనందయ్య మందుపై తనదైన శైలిలో కామెంట్ చేశారు. "నాకు నమ్మకం ఉందయ్యా.. అభిమానం లేనిదే ఆరాధన లేదు ఆరాధన లేనిదే మతం లేదు. మతం లేనిదే మానవుడే లేడు. అలాగే ప్రతీది ఒక నమ్మకం.. నేను నమ్ముతాను తప్పకుండా ఎందుకంటే, గొప్పగొప్ప వైద్యులున్నారు. క్రీస్తు పూర్వమే సుశంకుడనే వైద్యుడుండే వాడు.. ఆస్ట్రేలియా మెల్ బోర్న్ లో ఇవాళ్టికి కూడా రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జరీ లో ఆయన పేరుంది" అని బాలయ్య వ్యాఖ్యానించారు.