Chandrababu Arrest: గల్లీ నుంచి ఢిల్లీ చేరిన చంద్రబాబు అరెస్ట్ ఎపిసోడ్.. అసలేం జరిగింది?
Chandrababu Arrest: ఇంకా వారి ప్రాపకం కోసం పాకులాడాల్సిన పనిలేదని అభిప్రాయం
Chandrababu Arrest: స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టు అయినప్పటి నుంచి అనేక ట్విస్టులు వెలుగు చూస్తూనే ఉన్నాయి. గత కొన్నిరోజులుగా హస్తినలో మకాం వేశారు నారా లోకేశ్. తన తండ్రిని వైసీపీ ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసిందనే వాదనలు వినిపిస్తున్నారు. ఈ వ్యవహారాన్ని ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకెళ్లేందుకు గత కొన్ని రోజులుగా అక్కడే మకాం వేశారు. ఇందులోభాగంగానే కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో నారా లోకేశ్ సమావేశంపై ఏపీ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది.
అయితే కేంద్రహోంమంత్రి అమిత్ షాతో నారా లోకేశ్ సమావేశం కావడంపై టీడీపీ శ్రేణుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. టీడీపీ అధినేత అరెస్ట్ బీజేపీ పెద్దలకు తెలిసే జరిగిందని ముందునుంచి ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంలో ఇంకా వారి ప్రాపకం కోసం పాకులాడాల్సిన పని లేదని కొందరు సీనియర్లు అంతర్గతంగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారని సమాచారం.
అయితే క్షేత్రస్థాయిలోనే వైసీపీపై నిరంతర పోరాటం చేయాలని నారా లోకేశ్ టీడీపీ క్యాడర్ కు సూచించినట్లు సమాచారం. ఓ వైపు పార్టీ కార్యక్రమాలను వేగవంతం చేస్తూనే.. చంద్రబాబు అరెస్టు వ్యవహారంపై న్యాయ పోరాటం చేసేందుకు రెడీ అయ్యరు. ఈ రెండు అంశాలను బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగాలని సీనియర్ నేతలు నారా లోకేశ్ కు సూచిస్తున్నారు. మరి లోకేశ్ ఏం చేయబోతున్నారు? సీనియర్ల సూచనలు, సలహాలు స్వీకరిస్తారా అనేదానిపై చర్చ జరుగుతోంది. మరి సందిగ్ధంలో ఉన్న పార్టీ క్యాడర్ లో నారా లోకేశ్ జోష్ నింపుతారా? ఢిల్లీలో కంటే గల్లలోనే పోరాటాకు సై అంటారా అనే దానిపై ఆసక్తి నెలకొంది.