AP Metro Rail: ఏపీ మెట్రో రైలు ఎండీగా రామకృష్ణారెడ్డి నియామకం

AP Metro Rail: టీడీపీ హయాంలో మెట్రో రైలు ఎండీగా సేవలు

Update: 2024-08-02 15:59 GMT

AP Metro Rail: ఏపీ మెట్రో రైలు ఎండీగా రామకృష్ణారెడ్డి నియామకం

AP Metro Rail: ఏపీ మెట్రో రైలు ఎండీగా రామకృష్ణారెడ్డి నియామకం అయ్యారు. టీడీపీ హయాంలో మెట్రో రైలు ఎండీగా పని చేసిన ఆయన.. వైసీపీ ప్రభుత్వంలో కొన్ని కారణాల వల్ల పదవికి రాజీనామా చేశారు. మళ్లీ ఇప్పుడు ఏపీలో కూటమి ప్రభుత్వం రావడంతో రామకృష్ణారెడ్డినే మెట్రో ఎండీగా నియమించారు చంద్రబాబు. విశాఖ, విజయవాడలో మెట్రో రైలు సేవలు అందించాలని,, గత టీడీపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 2014లో రామకృష్ణారెడ్డిని టీడీపీ ప్రభుత్వం మెట్రో రైలు కార్పొరేషన్ ఎండీగా నియమించారు. దీంతో రామకృష్ణారెడ్డినే డీపీఆర్‌లు రెడీ చేశారు.

అనూహ్యంగా 2019లో ప్రభుత్వం మారింది. పోర్టులపై రామకృష్ణారెడ్డికి ఉన్న అనుభవం దృష్ట్యా మారిటైమ్ బోర్డుకు సీఈవోగా ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించారు. కానీ రామకృష్ణారెడ్డిపై మరొకరిని అధికారిగా నియమించడంతో ఆయన రాజీనామా చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయింది. మెట్రో ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తోంది. దీంతో రామకృష్ణారెడ్డినే మెట్రో రైలు ఎండీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Tags:    

Similar News