AP TET Results: ఏపీ టెట్‌-2024 ఫలితాలు విడుదల.. అర్హత సాధించని వారికి మళ్లీ టెట్‌

AP TET Results: ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (ఏపీ టెట్‌-2024) ఫలితాలు విడుదలయ్యాయి.

Update: 2024-06-25 10:48 GMT

 AP TET Results 2024: ఏపీ టెట్ ఫలితాలు వాయిదా..కొత్త రిజల్ట్స్ రిలీజ్ డేట్ ఇదే

AP TET Results: ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (ఏపీ టెట్‌-2024) ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టెట్‌లో అర్హత సాధించిన వారికి శుభాకాంక్షలు తెలిపారు. టెట్‌ పరీక్షలో 58.4 శాతం మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. లక్షా 37,904 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారని వెల్లడించారు. టెట్‌లో అర్హత సాధించని వారికి మరోసారి టెట్‌ నిర్వహిస్తామని, కొత్తగా బీఎడ్‌, డీఎడ్‌ పూర్తయిన వారికి కొత్త టెట్‌లో అవకాశాలు కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు.

మెగా డీఎస్సీకి అందరూ సన్నద్ధం కావాలని పిలుపు నిచ్చారు. టెట్ ఫలితాల కోసం 2.35 లక్షల మంది ఎదురుచూశారని వెల్లడించారు. డీఎస్సీలో టెట్ అర్హతకు 20 శాతం వెయిటేజి ఉండడంతో అందరూ ఆత్రుతగా ఎదురుచూశారని వివరించారు. ఇప్పుడు అర్హత సాధించని వారికి మరోసారి టెట్ నిర్వహిస్తామని మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. టెట్ ఫలితాల తర్వాత మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఉంటుందని తెలిపారు.

ఏపీ టెట్‌ – 2024 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Tags:    

Similar News