సీఎ‌స్‌కు ఎన్నికల కమిషనర్‌ లేఖ.. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ఆపాలని..

Update: 2020-11-17 08:58 GMT

ఏపీ సీఎస్‌కు ఎస్‌ఈసీ రమేష్‌ కుమార్ లేఖ రాశారు. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను ఆపాలని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మధ్యలో ఉందని అది పూర్తయ్యేదాకా జిల్లాల పునర్విభజన చేయడం తగదని ఎస్‌ఈసీ రమేశ్‌ కుమార్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి లేఖ రాశారు. రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు కోసం ప్రభుత్వం ఇప్పటికే సన్నహాలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఒక్కో పార్లమెంట్‌ నియోజకవర్గాన్ని ఒక్కో జిల్లాగా ఏర్పాటు చేయాలని, అదనంగా గిరిజన జిల్లాను ఏర్పాటు చేసి... మొత్తం 26 జిల్లాలుగా విభజించాలని నిర్ణయించారు.

దీనిపై ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి అధ్యయనం చేయిస్తున్నారు. 13 జిల్లాల ప్రాతిపదికన ఎన్నికల ప్రక్రియ చేపట్టామని ఎన్నికలు పూర్తయ్యే వరకు 13 జిల్లాలే ఉండాలన్నారు రమేష్ కుమార్. అయితే జిల్లాల సంఖ్య పెంచడం వల్ల జిల్లా పరిషత్‌ ఎన్నికల నిర్వహణకు సాంకేతిక సమస్యలు ఎదురవుతాయన్నారు. ఏపీలో సంక్రాంతి తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సన్నద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News