AP New Ministers: ఐదారుగురికి మళ్లీ ఛాన్స్..
Cabinet Reshuffle: ఏపీ మంత్రులు మూకుమ్మడిగా రాజీనామా చేశారు.
Cabinet Reshuffle: ఏపీ మంత్రులు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. ఈ మేరకు గవర్నర్ హరిచందన్‌కు మంత్రుల రాజీనామాలను సీఎం జగన్ పంపనున్నారు. ఈ రాత్రికే మంత్రుల రాజీనామాలను గవర్నర్ ఆమోదించనున్నారు. ఈ నెల 11న కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆదిమూలపు సురేశ్, సీదిరి అప్పలరాజు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, గుమ్మనూరు జయరాంలు మళ్లీ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం. సచివాలయంలో జరిగిన ప్రస్తుత మంత్రివర్గం చివరి సమావేశంలో 36 అంశాలపై చర్చించారు.
మిల్లెట్ మిషన్ పాలసీ, డిగ్రీ కళాశాలల్లో 574 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ వంటి తదితర ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వీటితో పాటు పులివెందులను కొత్త రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేసేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరోవైపు తాజా మాజీ మంత్రుల్లో ఐదారుగురుకి మళ్లీ మంత్రి పదవులు వచ్చే అవకాశముందని మంత్రి కొడాలి నాని చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. ఆ ఐదారుగురు ఎవరనే చర్చ ఇపుడు ఏపీలో మొదలైంది. సీఎం జగన్ నిర్ణయం మేరకు సంతోషంగానే తమ పదవులకు రాజీనామా చేశామన్నారు మంత్రులు. అధిష్టానం ఆదేశాల మేరకు పార్టీ కోసం పని చేస్తామన్నారు.