AP New Ministers 2022: ఏపీ కేబినెట్ లో సామాజిక వర్గాలకు ప్రాధాన్యం...
AP New Ministers 2022: తాజా విస్తరణలో 70 శాతం ఎస్సీ,ఎస్టీ, బీసీ వర్గాలకు ప్రాధాన్యత...
AP New Ministers 2022: అన్నివర్గాలకు సమన్యాయం కల్పిస్తూనే.. తనదైన మార్క్ కేబినెట్ విస్తరణకు శ్రీకారంచుట్టారు సీఎం జగన్. ముందు నుంచి చెబుతున్నట్లు అన్నివర్గాలకు సమప్రాధాన్యత కల్పిస్తూ...ఎస్సీ ఎస్టీ, మైనార్టీలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంది ఫ్యాన్ పార్టీ. అందులో భాగంగా కేబనెటక్ విస్తరణలో మొత్తం 17 మంది ఎస్సీ, ఎస్టీ., బీసీ మైనార్టీ వర్గాలకు అవకాశం కల్పించారు. రాజ్యాధికారంలో చరిత్రలో ఎప్పుడూలేని విధంగా ఆయావర్గాలకు పెద్దపీట.వేశామని చెబుతోంది.
అధికారంలోకి వచ్చిన 2019లోనే సామాజిక వర్గాలకు ప్రాధాన్యతనిచ్చింది వైయస్సార్‌సీపీ. ఇప్పుడు పునర్‌వ్యవస్థీకరణ ద్వారా మరో సామాజిక విప్లవం పరిపూర్ణమైందని చెబుతోంది. చరిత్రలో ఎప్పుడూ కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు అవకాశం కల్పించడాన్ని ఉదహరిస్తున్నారు ఆపార్టీ నేతలు. సీఎం జగన్ 2019లోని తన తొలి కేబినెట్లోని 25 మందిలో 14 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు, మరో 11 మంది ఓబీసీలకు ప్రాధాన్యత కల్పంచారు. ఇక తాజాగా కొలువుదీరిన కేబినెట్ లో 70శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అవకల్పించారు.
చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా చేలేని పనిని జగన్ చేశారని వైసీపీ నేతలు చెబుతున్నారు. నామినేటెడ్ పోస్టుల్లోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50శాతం, అవకాశం కల్పించింది ఒక్క వైయస్సార్‌సీపీనే అని చెబుతున్నారు ఆపార్టీ నేతలు. అందులోనూ యాభైశాతం మహిళలకే అవకాశం కల్పించిన ఘటన కూడా ఈ పార్టీదే.. ఇదిలా ఉంటే
ఏఎంసీలు, కార్పొరేషన్ ఛైర్మన్ల పదవుల్లోనూ 50శాతం ఇచ్చిన ఘనత ఆ ప్రభుత్వానిదనని చెబుతున్నారు. నామినేటెడ్ పోస్టుల్లో ఇప్పటికే 10 మందిని కొనసాగిస్తున్న వైయస్.జగన్.. డిప్యూటీ స్పీకర్ పదవిని వైశ్యులకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు అందులో భాగంగా విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామికి డిప్యూటీ స్పీకర్ పదవి, పదవి ప్లానింగ్ బోర్డు డిప్యూటీ ఛైర్మన్ పదవిని బ్రాహ్మణుల వర్గానికి చెందిన మల్లాది విష్ణుకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇక ప్రతిపక్ష నేత చంద్రబాబు హయాంలో ఇలాంటి సామాజిక న్యాయం జరగలేదంటున్నారు వైసీపీ నేతలు. 2014లోని 25తో కొలువుదీరిన బాబు కేబినెట్ లో 12 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలుంటే.. మంత్రిపదవుల్లో ముగ్గురు ఎస్సీలు, ఒక ఎస్టీ ఉన్నారని గుర్తు చేస్తున్నారు. ఇదే వాళ్లకు సామాజికవర్గాలపై ఉన్న మమతకారమని గుర్తుచేశారు. మాత్రమే ఉన్నారు.