Pensions: వచ్చే నెల నుంచి 2లక్షల మందికి పింఛన్లు కట్
Pensions:ఏపీలోని కూటమి సర్కార్ పెన్షన్ దారులకు బిగ్ షాక్ ఇచ్చే ప్లాన్ లో ఉంది. త్వరలోనే దాదాపు 2లక్షల మందికి పెన్షన్లను తొలగించబోతున్నట్లు సమాచారం.ఈనేపథ్యంలో ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
Pensions: ఏపీలోని కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా పెరిగిన పెన్షన్ మొత్తాన్ని లబ్ధిదారులకు అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి అచ్చెన్నాయుడు చేసిన పలు వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రాష్ట్రంలో అందిస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్లపై వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు సంచలన కామెంట్స్ చేశారు. త్వరలోనే వేలాది మంది పెన్షనర్లను తొలగిస్తున్నట్లు తెలిపారు.
త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా బోగస్ పింఛన్లను కట్ చేసే కార్యక్రమం చేపడతామని మంత్రి తెలిపారు. అర్హులకే నిజమైన సంక్షేమ ఫలాలు అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. కాగా ఏపీలో మొత్తం 65 లక్షల మందికిపై పింఛన్ లబ్దిదారులు ఉన్నారు. అయితే గత ప్రభుత్వ హయాంలో కొంతమంది బోగస్ పింఛన్లు తీసుకున్నట్లు ఏపీ సర్కార్ భావిస్తోంది. అర్హత లేని వారు కొంతమంది రాజకీయ నాయకులు, అధికారుల అండతో తప్పుడు పత్రాలను సమర్పించి పింఛన్ పొందతున్నట్లు తమ ద్రుష్టికి వచిందన్నారు.
కాగా ఈ కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు బోగస్ పింఛన్లు తొలగిస్తామంటూ వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే క్షేత్రస్థాయిలో పరిశీలన జరగనున్నట్లు సమాచారం. కూటమి సర్కార్ వృద్ధులకు రూ. 4వేలు, దివ్యాంగులకు రూ. 6వేలు పూర్తిస్థాయిలో వైకల్యం ఉన్నవాళ్లకు రూ.15వేలు, కిడ్నీ, తలసేమియా వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి రూ. 10వేల చొప్పున పింఛన్లు అందిస్తున్న విషయం తెలిసిందే. కాగా ప్రభుత్వం తీసుకనున్న ఈ నిర్ణయంతో దాదాపు 2 నుంచి 3లక్షల మందికి పింఛన్లు కోల్పోయే ఛాన్స్ ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.