ఏపీ ప్రభుత్వం, సోలార్ కంపెనీలకు ఏపీ హైకోర్టు నోటీసులు

High Court: ఏపీ ప్రభుత్వం, సోలార్ కంపెనీలకు ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

Update: 2021-12-20 10:25 GMT

ఏపీ ప్రభుత్వం, సోలార్ కంపెనీలకు ఏపీ హైకోర్టు నోటీసులు

High Court: ఏపీ ప్రభుత్వం, సోలార్ కంపెనీలకు ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సోలార్ ఎనర్జీ అగ్రిమెంట్‌పై 4 వారాల్లో సమాధానం చెప్పాలని నోటీసులు ఇచ్చింది. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, అదాని గ్రూప్‌తో యూనిట్ 2 రూపాయల 49 పైసల చొప్పున 9 వేల మెగావాట్ల కొనుగోలుకు అగ్రిమెంట్ కుదుర్చుకుంది ప్రభుత్వం. అయితే ఈ అగ్రిమెంట్ సరైనది కాదని సీపీఐ కార్యదర్శి రామకృష్ణ పిటిషన్ వేశారు.

బహిరంగ మార్కెట్‌లో యూనిట్ రూపాయి 99 పైసలకే దొరుకుతుందని పిటిషనర్ తెలిపారు. ఈ ఒప్పందం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం వాటిల్లుతుందని కోర్టుకు విన్నవించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు సౌర విద్యుత్ ఒప్పందాలపై ఏపీ ప్రభుత్వానికి, సోలార్ కంపెనీలకు, డిస్కంలకు నోటీసులు జారీ చేసింది.

Tags:    

Similar News