Andhra Pradesh: టెన్త్, ఇంటర్ పరీక్షలపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
Andhra Pradesh: టెన్త్, ఇంటర్ పరీక్షలపై ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. రాష్ట్రంలో కరోనా ఉధృతి దృష్ట్యా పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని సూచించింది.
Andhra Pradesh: టెన్త్, ఇంటర్ పరీక్షలపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
Andhra Pradesh: టెన్త్, ఇంటర్ పరీక్షలపై ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. రాష్ట్రంలో కరోనా ఉధృతి దృష్ట్యా పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని సూచించింది. ఇది లక్షలాది మంది విద్యార్థుల జీవితాలకు సంబంధించిన అంశమన్న కోర్టు పక్క రాష్ట్రాల్లో పరీక్షలు వాయిదా వేస్తుంటే మీరెలా నిర్వహిస్తారని నిలదీసింది. కోవిడ్ బాధిత విద్యార్థులకు విడిగా పరీక్షలు పెడతామని ప్రభుత్వం తెలపగా విద్యార్థుల మానసిక పరిస్థితి ఏ విధంగా ఉందో మీకెలా తెలుస్తుందని ప్రశ్నించింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన ధర్మాసనం తదుపరి విచారణ మే 3కి వాయిదా వేసింది.