AP High Court: నేడు ఏపీ హైకోర్టులో కరోనాపై విచారణ
AP High Court: కరోనా పరీక్షలు, వ్యాక్సినేషన్ పై వివరణ ఇవ్వనున్న ప్రభుత్వం
AP High Court: నేడు ఏపీ హైకోర్టులో కరోనాపై విచారణ జరగనుంది. కరోనా పరీక్షలు, వ్యాక్సినేషన్ పై ప్రభుత్వం.. హైకోర్టుకు వివరణ ఇవ్వనుంది. కరోనా నిర్ధారణ పరీక్షలను మరింత వేగవంతం చేయాలని.. ఎక్కువ టెస్టులు చేయాలని ఇప్పటికే కోర్టు, ప్రభుత్వాన్ని ఆదేశించింది. కాంట్రాక్టు నర్సులకు నెలల తరబడి ఉన్న బకాయి వేతనాలను కూడా చెల్లించాలని న్యాయస్థానం తెలిపింది. వృద్దులకు ఆధార్ లేకుండానే వ్యాక్సినేషన్ వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కరోనా వేళ మానసిక రోగులకు ఎలాంటి వైద్యచికిత్సలు అందిస్తున్నారని ధర్మానం ప్రశ్నించింది. మెంటల్ హెల్త్ యాక్ట్ ఏవింధంగా అమలు చేస్తున్నారని కోర్టు అడిగింది. కోర్టు అడిగిన ప్రశ్నలపై ప్రభుత్వం ఇచ్చిన కౌంటర్ పై ఇవాళ విచారణ జరగనుంది.