AP CM Jagan: మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం..
Amul: ఏపీ ప్రభుత్వం మరో కీలక ఒప్పందం చేసుకుంది.
Amul: ఏపీ ప్రభుత్వం మరో కీలక ఒప్పందం చేసుకుంది. అమూల్‌తో రాష్ట్ర ప్రభుత్వం సీఎం జగన్ సమక్షంలో ఒప్పందం చేసుకుంది. అనంతపురం జిల్లాలోని 85 గ్రామాల్లో జగనన్న పాలవెల్లువకు అమూల్ శ్రీకారం చూడుతోందని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ఇది మంచి పరిణామమని కొత్తగా అనంతపురం జిల్లాలో ప్రారంభిస్తున్నామన్నారు. వ్యవసాయానికి పాడి రైతులు తోడైతేనే గిట్టుబాటు ధర లభిస్తుందని, పాల సేకరణలో జరిగే మోసాలపై ప్రత్యేక దృష్టి సారించామని జగన్ తెలిపారు.
ఇప్పటికే ప్రకాశం, కడప, చిత్తూరు, గుంటూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో ఈ కార్యక్రమం కొనసాగుతున్నదని తెలిపారు. పాడి రైతుకు రూ.5 నుంచి రూ. 20 అదనపు ఆదాయం వస్తుందని, రాష్ట్రంలో ప్రభుత్వం బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తోందని వెల్లడించారు. అమూల్ తర్వాత ప్రైవేట్ కంపెనీలు రేట్లు పెంచాల్సి వచ్చిందని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు.