తిరుపతి రుయా అంబులెన్స్ మాఫియా ఘటనపై ప్రభుత్వం సీరియస్...
Tirupati Ruia Ambulence Issue: మహాప్రస్థానం వాహనాలు 24గంటలు పనిచేసేలా చర్యలు...
Tirupati Ruia Ambulence Issue: తిరుపతి రుయా అంబులెన్స్ మాఫియాపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. విధుల్లో నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. CSRMO సరస్వతీ దేవిని సస్పెన్సన్ చేసింది. రుయా ఆస్పత్రి సూపరింటెండెంట్ భారతికి షోకాజ్ నోటీసులు ఇచ్చారు. మరోవైపు అంబులెన్స్ ధరలను నిర్ణయించేందుకు ప్రభుత్వం కమిటీ వేసింది. RDO, DMHO, DSP బృందంతో కమిటీ వేసింది అంబులెన్స్ అడ్డుకున్న ఆరుగురుపై అలిపిరి పోలీసులు కేసు నమోదు చేశారు.
తిరుపతి రుయా ఘటనపై వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజని స్పందించారు. మృతదేహాలతో వ్యాపారం చేసే వారిని కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. ఘనటపై సమగ్ర విచారణకు ఆదేశించామన్నారు. మహా ప్రస్థానం వాహనాలు రాత్రిళ్లు కూడా పనిచేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రీపెయిడ్ ట్యాక్సీల విషయాన్ని పరిశీలిస్తామని చెప్పారు. అన్ని ఆస్పత్రుల వద్ద ప్రైవేటు అంబులెన్సులను నియంత్రిస్తామని మంత్రి రజని స్పష్టం చేశారు.