Rythu Bharosa Kendram : రైతు భరోసా కేంద్రాలకు 'వైఎస్సార్'‌ పేరు

Update: 2020-07-06 09:31 GMT

AP Govt ordered to rename the "Rythu Bharosa Kendram" as Dr. YSR Rythu Bharosa Kendram : ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరును రైతు భరోసా కేంద్రాలకు పెడుతూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై రైతు భరోసా కేంద్రాలను 'డాక్టర్‌ వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలు'గా ప్రభుత్వం వ్యవహరించనుంది. రైతులకు మాజీ సీఎం వైఎస్సార్‌ చేసిన సేవలకు గుర్తుగా ఆయన పేరును ఖరారు చేసినట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

రాష్ట్రంలో రైతుల దగ్గరకే సాగుకు సంబంధించిన సమస్త సేవలు పొందే వినూత్న వ్యవస్థ రైతు భరోసా కేంద్రాలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా మే 30న సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ‌ రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించారు. తాజాగా ఈ కేంద్రాలకు వైఎస్ఆర్ పేరు పెడుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉంటే వైఎస్సార్‌ జయంతి అయిన జూలై 8న రైతు దినోత్సవంగా ప్రకటిస్తూ ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు వైఎస్సార్‌ పేరు కలిసేలా ఇప్పటికే పలు పథకాలను జగన్ ప్రారంభించిన విషయం తెలిసిందే.


Tags:    

Similar News