AP Govt: మహిళలకు అండగా.. ప్రత్యేక కార్యక్రమానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం
AP Govt: రాష్ట్రస్థాయిలో పట్టణ పగ్రతి యూనిట్ల పేరుతో స్పెషల్ ప్రోగ్రామ్
AP Govt: రాష్ట్రస్థాయిలో పట్టణ ప్రగతి యూనిట్ల పేరుతో ప్రత్యేక కార్యక్రమానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రతి పట్టణంలో స్వయం సహాయక సంఘాల నుంచి స్వయంచాలక ఉపాధిని ఏర్పాటు చేసుకోవడానికి ఆసక్తి కలిగిన ఒక సభ్యురాలిని ఎంపిక చేసి, వారికి 4రోజుల పాటు ప్రత్యేక శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని కేఎల్ యూనివర్సిటీలో నిర్వహించినట్టు మెప్మా మిషన్ డైరెక్టర్ శ్రీమతి వి.విజయలక్ష్మి తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా మహిళలకు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ, పేపర్ ప్లేట్లు, గుడ్చ సంచులపై అచ్చు వేయడం, ఆర్టిఫిషియల్ జ్యువెలరీ తయారీ, కారం, మసాలా పొడుల తయారీపై శిక్షణ ఇచ్చినట్టు తెలిపారు. శిక్షణానంతరం సభ్యుల సొంత పట్టణాల్లో యూనిట్లను ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం సహకరిస్తుందని, వారికి మిషనరీతో పాటు మొదట మూడు నెలలకు సరిపడా ముడి సరుకు మరియు షాప్ అద్దె కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని మెప్మా మిషన్ డైరెక్టర్ శ్రీమతి వి.విజయలక్ష్మి వెల్లడించారు.