చంద్రబాబుకు బిగ్ షాక్.. ఇల్లు అటాచ్
Chandrababu: క్రిమినల్ లా అమెండ్‌మెంట్ 1944 చట్టం ప్రకారం అటాచ్
Chandrababu: కరకట్టపై చంద్రబాబు గెస్ట్‌హౌస్‌ను అటాచ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. క్రిమినల్ లా అమెండ్‌మెంట్ - 1944 చట్టం ప్రకారం అటాచ్ చేసినట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ తమ పదవులను దుర్వినియోగం చేసి, క్విడ్‌ప్రో కోకు పాల్పడ్డారన్న కేసు విచారణ జరిపిన తర్వాత చర్యలు తీసుకుంది ఏపీ సర్కార్... CRDA మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్‌రోడ్ అలైన్‌మెంట్లలో ఇద్దరు నేతలు అవకతవకలకు పాల్పడ్డారని, కరకట్టపై లింగమనేని గెస్ట్‌హౌస్ పొందారని ఆరోపణల నేపథ్యంలో విచారణ జరిపింది ప్రభుత్వం.
చట్టాలు, కేంద్ర విజిలెన్స్ కమిషన్ మార్గదర్శకాలను నేతలు ఉల్లంఘించారని ఆరోపించింది.. సాధారణ ఆర్థిక నియమాలను ఉల్లంఘించారనే అంశం ప్రభుత్వం చేపట్టిన విచారణలో వెల్లడయింది. బంధువులకు, సన్నిహితులకు ప్రయోజనం కల్పించేలా వ్యవహరించారని ఆరోపించింది సర్కార్.. వ్యాపారి లింగమనేని అనుకూలంగా నేతలు వ్యవహరించారని, ప్రతిఫలంగా గెస్ట్‌హౌస్ తీసుకున్నారని చంద్రబాబుపై అభియోగం ఉంది. క్రిమినల్ లా అమెండ్‌మెంట్ 1944 చట్టం ప్రకారం అటాచ్ చేయాలని ప్రభుత్వాన్ని సీఐడీ కోరింది. ఈ క్రమంలో చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం అటాచ్ చేసింది. స్థానిక జడ్జికి సమాచారమిస్తూ కరకట్టపై ఉన్న లింగమనేని గెస్ట్ హౌస్‌ను అటాచ్ చేసింది ఏపీ సర్కార్.