చర్చలకు నై... సమ్మెకే సై..

AP Employee Unions: ఊహించినట్టే ఏపీ ఉద్యోగ సంఘాలు చర్చలకు నై చెప్పి.. సమ్మెకే జై కొట్టాయి.

Update: 2022-01-23 16:02 GMT

చర్చలకు నై... సమ్మెకే సై..

AP Employee Unions: ఊహించినట్టే ఏపీ ఉద్యోగ సంఘాలు చర్చలకు నై చెప్పి.. సమ్మెకే జై కొట్టాయి. దాదాపు 5 గంటల పాటు జరిగిన పీఆర్సీ సాధన సమితి స్టీరింగ్ కమిటీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రేపు ఏపీ సీఎస్‌కు సమ్మె నోటీసు ఇవ్వనున్నట్టు తెలిపిన ఉద్యోగ సంఘాల నేతలు.. ఇందులో ఎలాంటి రాజకీయ పక్షాలను ఆహ్వానించడం లేదని క్లారిటీ ఇచ్చారు. ఇదే సమయంలో మరోసారి ప్రభుత్వం స్టీరింగ్ కమిటీని చర్చలకు ఆహ్వానించింది. సీఎస్, మంత్రులతో చర్చిద్దామంటూ జీడీఏ సెక్రటరీ శశిభూషణ్ ఉద్యోగులను ఆహ్వానించారు. అయితే, ప్రభుత్వ ఆహ్వానానని ఉద్యోగులు తిరస్కరించారు. పీఆర్సీ జీవోను వెనక్కు తీసుకుంటేనే చర్చలని తేల్చి చెప్పేశారు.

మరోవైపు.. ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమపై వైసీపీ నేతలు మాటల యుద్ధం చేస్తున్నారని మండిపడ్డారు. ఉద్యోగులతో ఘర్షణ వాతావరణం తగదని, ఉద్యోగులను రెచ్చగొట్టడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. తాము ప్రభుత్వం నుంచ మెరుగైన పీఆర్సీని మాత్రమే కోరుతున్నామన్నారు.

ఇక ఉద్యమ కార్యాచరణలో భాగంగా 8మంది సభ్యులతో మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేసినట్టు ఉద్యోగ సంఘాలు తెలిపాయి. ఈ మానిటరింగ్ సెల్ విమర్శలను తిప్పికొడుతుందని నేతల తెలిపారు. ఇదే సమయంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీకి సంబంధించి ప్రభుత్వం నుంచి తమకెలాంటి ఉత్తర్వులు రాలేదన్నారు. కొత్త పీఆర్సీని నిలిపివేసి, జనవరి నెలకు పాత జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు నెరవేర్చేవరకు ప్రభుత్వంతో చర్చలకు వెళ్లవద్దని నిర్ణయం తీసుకున్నట్టు జేఏసీ నేతలు స్పష్టం చేశారు.

Tags:    

Similar News