ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపు.. ధరలు పెంచడం బాధకరంగా ఉన్నా...
AP Electricity Charges Hike: తప్పని పరిస్థితుల్లో గృహ వినియోగదారులపై భారం మోపాల్సి వచ్చింది...
AP Electricity Charges Hike: ఏపీలో విద్యుత్ ఛార్జీల మోత మోగింది. రాష్ట్రంలో విద్యుత్ చార్జీల్ని పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం ఏపీలో విద్యుత్ ఛార్జీలు యూనిట్ కు 45 పైసల నుంచి రూపాయి 16 పైసల వరకు పెరగబోతున్నాయి. ఏపీలో తాజాగా పెరిగిన విద్యుత్ ఛార్జీల ప్రకారం 30 యూనిట్ల వరకు యూనిట్ కు 45 పైసలు, 31 నుంచి 75 యూనిట్ల వరకు యూనిట్ కు 91పైసలు, 76 నుంచి 125 యూనిట్ల వరకు యూనిట్ కు రూపాయి 40 పైసలు పెరిగింది.
ఇక 126 నుంచి 225 యూనిట్ల వరకు యూనిట్ కు రూపాయి 57 పైసలు, 226 నుంచి 400 యూనిట్ల వరకు యూనిట్ కు రూపాయి 16 పైసలు చొప్పున పెరిగింది. తిరుపతిలో విద్యుత్ చార్జీల టారిఫ్ ను APERC చైర్మన్ సీవి నాగార్జున రెడ్డి విడుదల చేశారు. కేటగిరీలను రద్దు చేసి 6 స్లాబ్ లను తీసుకొస్తున్నామని తెలిపారు. విద్యుత్ సంస్థల మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది కాబట్టే తప్పని పరిస్థితుల్లో చార్జీలు పెంచాల్సి వచ్చిందన్నారు.