AP EAMCET: ఎంసెట్ నోటిఫికేషన్ విడుదల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంసెట్ రాసే విద్యార్థుల కోసం AP EAMCET 2020 షెడ్యూల్ ను విడుదల చేసారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంసెట్ రాసే విద్యార్థుల కోసం AP EAMCET 2020 షెడ్యూల్ ను విడుదల చేసారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదివే విద్యార్థులు భవిష్యత్తులో ఇంజనీరంగ్ చదవాలనే వారి కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసారు. ఇందులో భాగంగానే ఆన్ లైన్ దరఖాస్తులను ఈ నెల 26వ తేది నుంచి మార్చి 27, వరకు స్వీకరించనున్నారు. ఆలస్యరుసుము రూ .500లతో దరఖాస్తులను ఏప్రిల్ 4 వ తేది వరకు స్వీకరించనున్నారని ఉన్నత విద్యామండలి తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (AP EAMCET) ను జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం కాకినాడ ప్రతి సంవత్సరం నిర్వహిస్తుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌లో 3 గంటలు ఆన్లైన్ పరీక్ష ఉంటుందని తెలిపారు. AP EAMCET-2020 కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే అర్హత గల అభ్యర్థులు 28-02-2020 నుండి 29-03-2020 వరకు (ఆలస్య రుసుము లేకుండా) ఆన్‌లైన్ మోడ్ ద్వారా మాత్రమే దరఖాస్తును సమర్పించవచ్చు. పూర్తి సమాచారాన్ని అధికారిక వెబ్ సైట్ http://www.sche.ap.gov.in లో అందుబాటులో ఉంచుతామని తెలిపారు.
AP EAMCET 2020 నోటిఫికేషన్ తేదీలు
♦ AP Eamcet నోటిఫికేషన్ విడుదల తేదీ : 22 ఫిబ్రవరి 2020
♦ ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ : 26 ఫిబ్రవరి 2020
♦ దరఖాస్తులకు చివరి తేదీ : 27 మార్చి 2020
♦ ఆన్‌లైన్ దరఖాస్తు ఫారం దిద్దుబాటు తేదీ : 01 నుండి 04 ఏప్రిల్ 2020 వరకు
♦ దరఖాస్తు ఫారమ్‌ను రూ.500 ఆలస్య రుసుముతో సమర్పించే తేది : 04 ఏప్రిల్ 2020
♦ రూ.1000 ఆలస్య రుసుముతో చివరి తేదీ : 09 ఏప్రిల్ 2020
♦ రూ.5000 ఆలస్య రుసుముతో చివరి తేదీ : 14 ఏప్రిల్ 2020
♦ రూ.10000 ఆలస్య రుసుముతో చివరి తేదీ : 19 ఏప్రిల్ 2020
♦ 16 ఏప్రిల్ 2020 నుండి అడ్మిట్ కార్డు అందుబాటులో ఉంటుంది.
♦ ఇంజనీరంగ్ పరీక్షల తేదీ 20 నుండి 24 ఏప్రిల్ 2020 వరకు
♦ ఎంసెట్ అగ్రికల్చర్ & మెడికల్ పరీక్షకు తేదీ : 23-04-2020 నుంచి 24-04-2020
♦ పరీక్ష తుది ఫలితాలు ప్రకటించే తేది : 5 - 5- 2020