సుప్రీం విచారణకు హాజరైన ఏపీ సీఎస్.. జీవితంలో తొలిసారి కోర్టుకు హాజరైనట్లు పేర్కొని..
Supreme Court: సుప్రీంకోర్టు ఎదుట హాజరయ్యారు ఏసీ సీఎస్ సమీర్‌శర్మ.
Supreme Court: సుప్రీంకోర్టు ఎదుట హాజరయ్యారు ఏసీ సీఎస్ సమీర్‌శర్మ. జీవితంలో తొలిసారి కోర్టుకు హాజరైనట్లు పేర్కొన్న ఆయన కోర్టుకు క్షమాపణలు చెప్పారు. అఫిడవిట్ దాఖలు చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని జస్టిస్ ఎంఆర్ షా చెప్పగా.. కోర్టుకు ఇలా హాజరుకావడం పట్ల ఫీలవుతున్నానని అన్నారు సీఎస్ సమీర్‌శర్మ.
రాష్ట్రంలో కోవిడ్ మృతుల కుటుంబాలకు పరిహారానికి సంబంధించి ఇప్పటివరకు 41 వేలకు పైగా దరఖాస్తులు రాగా 34వేలకు పైగా ఆమోదించి డబ్బుల పంపిణీ కొనసాగుతుందని ప్రభుత్వ న్యాయవాది బసంత్ కోర్టుకు తెలిపారు. తానే వ్యక్తిగతంగా బాధితులకు డబ్బులు అందేలా చూస్తానని సీఎస్ సమీర్‌శర్మ హామీ ఇచ్చారు. రెండు వారాల్లోగా బాధితులకు పరిహారమిచ్చి కోర్టుకు తెలియజేస్తానన్నారు ఏపీ సీఎస్.