కొవిడ్ వ్యాక్సినేషన్ 39 కోట్ల మందికి ఆగస్టు కల్లా పూర్తికాదు: సీఎం జగన్
Covid Vaccine: కొవిడ్ వ్యాక్సినేషన్ పై ఏపీ సీఎం జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
Covid Vaccine: కొవిడ్ వ్యాక్సినేషన్ పై ఏపీ సీఎం జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. కొవిడ్ కు కేవలం వ్యాక్సినేషన్ మాత్రమే ఒక పరిష్కారంగా ఉందన్నారు. అయితే.. ఈ సమస్య ఎప్పుడూ తీరుతుందో కూడా తెలియదన్నారు. దేశంలో వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్థ్యం నెలకు 7కోట్లు ఉన్నట్లు సీఎం తెలిపారు. ఆ లెక్కన చూస్తే.. దేశం మొత్తం వేయాలంటే.. వచ్చే జనవరి నాటికి సమయం పట్టే అవకాశం ఉందన్నారు సీఎం. అన్ని వ్యాక్సిన్లు కలిపి ఆగస్టు నాటికి 20 కోట్ల వ్యాక్సిన్లు ఉత్పత్తి కావొచ్చన్నారు. 39 కోట్ల వ్యాక్సిన్ డిమాండ్ ఆగస్టు, సెప్టెంబర్ కల్లా పూర్తికాదన్నారు సీఎం జగన్..
18 నుంచి 45 ఏళ్ల మధ్య వయసు వారు దేశంలో 60 కోట్ల మంది ఉన్నారు.. వారందరికి టీకా అందించాలంటే చాలా కాలం పడుతుందన్నారు సీఎం జగన్.. భారత్ బయోటెక్ నెలకు కోటి వ్యాక్సిన్లు తయారు చేస్తుండగా.. సీరమ్ ఇన్‌స్టిట్యూట్ 6కోట్ల వ్యాక్సిన్లు తయారు చేస్తోంది. వీటితో పాటు రెడ్డి ల్యాబ్స్, ఇతర సంస్థల ఉత్పత్తులు రావడానికి ఇంకా నెలల సమయం పడుతుందన్నారు.. 45 ఏళ్లకు పైబడిన వారందరికీ వాక్సినేషన్ పూర్తయ్యాక.. 18–45 ఏళ్ల మద్య వయస్సు వారికి సెప్టెంబరు నుంచి వాక్సీన్ ఇవ్వొచ్చని అంచనా వేశారు. ఆ మేరకు వారికి వాక్సినేషన్ పూర్తి కావడానికి నాలుగు నెలలు పడుతుందన్నారు. అంటే వచ్చే ఏడాది జనవరి చివరి నాటికి వారందరికీ వాక్సీన్ చేయగలమని స్పష్టం సీఎం జగన్ చేశారు.