వారికి వెంటనే 5 లక్షలు.. సీఎం జగన్ ఆదేశం!

కొన్ని రొజులుగా ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తం అయింది. పలు వాగులు పొంగి ఉళ్ళను వరదలు ముంచెత్తాయి. దీనితో వరదల తాకిడికి రాష్ట్రవ్యాప్తంగా పలువురు మృత్యవాత పడ్డారు..

Update: 2020-10-20 12:02 GMT

కొన్ని రొజులుగా ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తం అయింది. పలు వాగులు పొంగి ఉళ్ళను వరదలు ముంచెత్తాయి. దీనితో వరదల తాకిడికి రాష్ట్రవ్యాప్తంగా పలువురు మృత్యవాత పడ్డారు.. వారి కుటుంబాలను తక్షణమే ఆదుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు. ఆయా కుటుంబాలకు వెంటనే అయిదు లక్షల రూపాయల చొప్పున సహాయాన్ని అందించాలని అధికారులకు జగన్ చెప్పారు.

అటు ఈ రోజు ఏపీ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో జగన్ స్పందన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. భారీ వర్షాలు, వరదలు, సహాయక చర్యలపై ప్రధానంగా చర్చ జరిగింది. స్కూళ్లు, ఆస్పత్రులు, అంగన్ వాడి కేంద్రాల్లో నాడు- నేడు అమలు అవుతున్న తీరు, గ్రామ సచివాలయాలు, ఆర్‌వీకేలు, వీలేజ్ హెల్త్ క్లినిక్స్ నిర్మాణాల ప్రగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

Tags:    

Similar News