YS Jagan: జలవనరులశాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష
*పోలవరం పనుల పురోగతిని సీఎంకు వివరించిన అధికారులు *దిగువ డ్యాం పనులు, కెనాల్స్‌కు కనెక్టివిటీ తదితర అంశాలపై చర్చ
YS Jagan: జలవనరులశాఖపై ఏపీ సీఎం జగన్ కీలక సమీక్ష నిర్వహించారు. ఇరిగేషన్ అధికారులతో జరిగిన సమావేశంలో పోలవరం పనుల పురోగతి, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తదితర అంశాలపై కీలక చర్చ జరిగింది. ఈ సందర్భంగా పోలవరం పనుల ప్రగతిని సీఎంకు వివరించిన అధికారులు గ్యాప్ 3 కాంక్రీట్ డ్యామ్ పనులు పూర్తి చేసినట్లు తెలిపారు.
ఇదే సమయంలో కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై సీఎం జగన్‌కు అధికారులు వివరాలందించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి 2వేల 33 కోట్లకు పైగా రావాల్సి ఉందన్నారు. అనంతరం కేంద్రం నుంచి నిధులు తెప్పించుకొనేలా ఏర్పాట్లు చేయాలని జగన్ అధికారులను ఆదేశించారు.