AP Curfew: జూన్ 20 తర్వాత ఏపీలో కర్ఫ్యూ సడలింపులు- సీఎం జగన్
AP Curfew: కరోనాపై సీఎం జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
AP Curfew: కరోనాపై సీఎం జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రైవేట్ ఆస్పత్రులపై కలెక్టర్లు దృష్టి సారించాలని నిర్ణయించిన రేట్లకే ఫీజులు వసూలు చేయాలని సూచించారు. ఎక్కువ ఫీజులు వసూలు చేస్తే చర్యలు తీసుకోవాలని అలాంటి ఆస్పత్రులను మూసివేసేందుకు కూడా వెనకాడొద్దని తేల్చి చెప్పారు.
మహమ్మారి సమయంలో ప్రజలను పీడించే వారిపై కఠినంగా ఉండాలన్న సీఎం జగన్ మొదటిసారి ఉల్లంఘిస్తే పెనాల్టీ, రెండోసారి ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు పెట్టాల్సిందేనన్నారు. ఇక కరోనా థర్డ్‌వేవ్ వస్తుందో లేదో తెలియదని మనం మాత్రం సిద్ధంగా ఉండాలన్నారు. ఈ సందర్భంగా జూన్ 20 వరకు కర్ఫ్యూ ఉంటుందని తర్వాత కొన్ని సడలింపులు ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేశారు సీఎం జగన్.