ఏపీ మంత్రులకు సీఎం జగన్‌ ఆఫర్‌.. జగన్‌ నిర్ణయంతో మంత్రుల్లో కొత్త జోష్

Jagan: ఏపీ మంత్రులకు సీఎం జగన్‌ ఆఫర్‌ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.

Update: 2021-10-29 08:12 GMT

ఏపీ మంత్రులకు సీఎం జగన్‌ ఆఫర్‌.. జగన్‌ నిర్ణయంతో మంత్రుల్లో కొత్త జోష్

Jagan: ఏపీ మంత్రులకు సీఎం జగన్‌ ఆఫర్‌ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. కేబినెట్‌లోని మంత్రులు రెండున్నర కాలమే ఉంటారని, ఆ తర్వాత కొత్త మంత్రులు వస్తారని గెలిచిన రోజే చెప్పారు సీఎం జగన్. ఇందుకు అందరూ సిద్దంగా ఉండాలని కూడా అన్నారు. దీంతో రెండున్నరేళ్లకే పదవి అనుకుంటూ సర్దుకుపోయారు. దీని ప్రకారం వచ్చే నెలలో వారి స్థానాల్లో కొత్తవారు రావాలి. అయితే కొందరి వినతులు, పార్టీ కీలక నేతల సూచనలతో ఈ విషయంలో సీఎం జగన్ నిర్ణయం కాస్త మార్చుకునట్లు తెలుస్తోంది. రెండున్నరేళ్లకు బదులు మూడేళ్లు వీరినే కొనసాగించే ప్లాన్‌లో సీఎం జగన్‌ ఉన్నట్టు తెలుస్తోంది. వచ్చే జూన్ వరకూ ఇప్పుడున్న మంత్రులనే కొనసాగించి చివరి రెండేళ్లు కొత్తవారికి ఛాన్క్ ఇచ్చే ఆలోచన చేస్తున్నారంట సీఎం జగన్.

కోవిడ్‌ కారణంగా మంత్రులు చాలాకాలం ఇళ్లకు, కార్యాలయాలకే పరిమితమయ్యారు. కరోనాతో ఇచ్చిన రెండున్నరేళ్లలో ఏడాదికి పైగా కాలం వృధా అవడంతో సీఎం జగన్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దీనికి తోడు కొందరు సీనియర్లు బహిరంగంగాను మరికొందరు ఇంటర్నల్‌గా పదవీ కాలం ముగింపుపై అసంతృప్తిగా ఉన్నారని టాక్‌. దీంతో సీఎం జగన్‌ ఇచ్చిన ఈ ఆఫర్‌ ఆయా మంత్రుల్లో జోష్‌ నింపుతోందట. మరో ఆరునెలల పాటు మంత్రులుగా ఉండొచ్చని, ఈ పది నెలల్లో మంచి పనితీరు కనబర్చాలని తహతహలాడుతున్నారంట మంత్రులు.

Tags:    

Similar News