సీఎం జగన్ కీలక ప్రకటన.. అసని తుపాను ప్రభావిత కుటుంబాలకు పరిహారం..
Asani Cyclone: అసని తుపాన్‌పై సీఎం జగన్ కీలక సమీక్ష నిర్వహించారు తుపాను ప్రభావిత కలెక్టర్లు, ఎస్పీలతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు.
Asani Cyclone: అసని తుపాన్‌పై సీఎం జగన్ కీలక సమీక్ష నిర్వహించారు తుపాను ప్రభావిత కలెక్టర్లు, ఎస్పీలతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. తుపాను నేపథ్యంలో అధికారులంతా హై అలర్టుగా ఉండాలని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశాలు జారీచేశారు. తీర ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు సీఎం జగన్. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంద్నారు. తుపాను బలహీనపడినా ఎక్కడా నిర్లక్ష్యానికి తావివ్వకుండా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు.
అవసరమైన చోట సహాయపునరావాస శిబిరాలను వెంటనే ఏర్పాటు చేయాలన్నారు సీఎం జగన్. సహాయ శిబిరాల్లో తలదాచుకుంటున్న ఒక్కో వ్యక్తికి వెయ్యి రూపాయలు, కుటుంబానికి 2వేల చొప్పున చెల్లించాలని అధికారులకు సూచించారు. సహాయ శిబిరాల్లో బాధితులకు మంచినీరు, ఆహారం, దుప్పట్లను అందజేయాలన్నారు. తుపాన్ ప్రభావంతో కమ్యూనికేషన్ వ్యవస్థకు అంతరాయం ఏర్పడితే వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు సీఎం జగన్.