Andhra Pradesh: లిస్ట్ రెడీ.. వారికి చెక్.. సగం మందికి నో టికెట్
Andhra Pradesh: టైంపాస్ నేతలకు జగన్ చెక్ పెడుతున్నారా..?
Andhra Pradesh: టైంపాస్ నేతలకు జగన్ చెక్ పెడుతున్నారా..? పార్టీ కోసం కష్టపడే వారికే వచ్చే ఎన్నికల్లో టికెట్లు దక్కనున్నాయా..? తాజా పరిస్థితి అలాగే ఉంది. కొత్త మొహాలు కొత్త ఆలోచనలు కొత్త నాయకత్వం ప్రస్తుతం సీఎం జగన్ మనసులో ఉన్నది ఇదే.
జనంలో లేకపోతే చోటు లేదు. ప్రజల దగ్గరకు వెళ్లకపోతే టికెట్ రాదు. ప్రస్తుతం 150 మందిలో ఒకరిగా ఉండి, అసెంబ్లీలోనో లేదా ఇతర కార్యక్రమంలోనో చుట్టపు చూపుగా ఉంటే ఆ ఎమ్మెల్యే ఇక ఇంటికె. వ్యాపారం చేసుకుంటూ సొంత పనుల్లో తిరుగుతూ పార్ట్ టైం పోలిటిక్స్ చేస్తే ఇక అంతే సంగతులు. పార్టీకి మద్దతుగా అంటి పెట్టుకుని ఉంటేనే నాయకుడు.
2019 ఎన్నికల్లో జగన్ బొమ్మ ఒక్కటే కనిపించింది. ఆ ఒక్క ఫొటోనే 150కి పైగా ఎమ్మెల్యేల్ని గెలిపించింది. కానీ ఇప్పుడు అలా కాదు. అనేక అంశాలు. జగన్ పాలన ఎలా ఉంది..? ఎమ్మెల్యేల పనితీరు ఎవరు కష్టపడుతున్నారు..? ఎవరు జనాల్లో ఉన్నారు..? ఇలా ప్రతిదీ లెక్కే. 150 మందిలో ఉన్నాం కదా మనకేంటీ అనుకుంటే పప్పులో కాలే. ఆచితూచి అడుగులు వేయాల్సిందే.
చంద్రబాబును రాజకీయంగా తక్కువ అంచనా వేస్తే కష్టం. మరోవైపు జనసేన ఎలాగు నేనున్నానంటోంది. పరిణామాలు ఎలా అయినా మారచ్చు. అందుకే 2024 ఎన్నికల్లో సగం మందికి నో టికెట్ అనే ఆలోచనలో జగన్ ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే లిస్ట్ రెడీ అయ్యింది. ఎన్నికలు కొద్దిగా ముందుగా వస్తే ఈ ఎమ్మెల్యేలకు ఇంకా ఇబ్బంది. మొత్తానికి ఎవరు గుడ్ ఎవరు బ్యాడ్ అనేది లిస్ట్ ఔట్ చేశారు సీఎం జగన్. మోహమాటాలు లేవ్ మాటలు అసలే లేవ్ కేవలం గెలుపు మాత్రమే లక్ష్యం.