AP Cabinet Meeting: ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ
AP Cabinet Meeting: మధ్యాహ్నం 3 గం.లకు సీఎం అధ్యక్షతన భేటీ
AP Cabinet Meeting: ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ కానుంది. మధ్యాహ్నం 3 గం.లకు అమరావతి సచివాలయం మొదటి బ్లాకులో ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ అన్ని శాఖల కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేశారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం రేపు ఉదయం 11గం.లకు రాష్ట్ర మంత్రివర్గం భేటీ జరగాల్సి ఉంది. అయితే, అనివార్య కారణాలతో మంత్రివర్గ సమావేశాన్ని ఒకరోజు ముందుగానే అంటే ఇవాళ మధ్యాహ్నం నిర్వహించనున్నారు. మంత్రివర్గపునర్ వ్యవస్తీకరణ తర్వాత తొలిసారిగా కేబినేట్ భేటీ కానుంది.
కొత్త మంత్రివర్గం తొలి సమావేశంలో కీలక నిర్ణయాలను ఏజెండాగా తీసుకుంటారని తెలుస్తోంది. మూడు రాజధానుల బిల్లు మరోసారి కేబినెట్ లో చర్చించే అవకాశముంది. అలాగే మరో రెండేళ్లలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని మంత్రివర్గానికి సీఎం జగన్ దిశానిర్దేశం చేస్తారని తెలుస్తోంది. ఈ క్యాబినెట్ భేటీలో అనేక అంశాలపై విస్తృతంగా చర్చించనున్నారు. సంచలన నిర్ణయాలను తీసుకోబోతున్నారు వైఎస్ జగన్.