ముగిసిన కేబినెట్ సమావేశం.. పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం..
AP Cabinet meeting ends: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ముగిసింది. సీఎం జగన్ అధ్యక్షతన బుధవారం సచివాలయంలో నిర్వహించిన కేబినెట్ బేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
AP Cabinet meeting ends: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ముగిసింది. సీఎం జగన్ అధ్యక్షతన బుధవారం సచివాలయంలో నిర్వహించిన కేబినెట్ బేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వైయస్ఆర్ ఆసరా పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆసరా పథకం ద్వారా నాలుగేళ్లలో 27 వేల కోట్లకుపైగా డ్వాక్రా మహిళలకు లబ్ధి చేకూరనుంది. వైఎస్ఆర్ విద్యాకానుక పథకానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. సెప్టెంబరు 5 నుంచి ఈ పథకం అమల్లోకి రానుంది. అలాగే వైఎస్సార్ సంపూర్ణ పోషకాహార పథకానికి కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. మహిళలు, శిశువులకు సంబంధించి పూర్తి స్థాయిలో పోషకాహారం అందించే విధంగా ఈ పథకాన్ని రూపకల్పన చేశారు. బీసీ ఫెడరేషన్లు, రామనపాడు పోర్టు డీపీఆర్‌కు మంత్రి వర్గం ఆమోదం తెలిపినట్లు సమాచారం. గోదావరి వరద ముంపు ప్రాంతాల్లో సహాక చర్యలపై కేబినెట్ చర్చించింది.