New Sand Policy: కొత్త ఇసుక పాలసీకి ఏపీ కేబినెట్ ఆమోదం

AP Cabinet Approved New Sand Policy: ఇప్పటికే పలుమార్లు ఇసుక పాలసీని మార్చిన జగన్ ప్రభుత్వం కేబినెట్ సబ్‌కమిటీ సిఫార్సుల మేరకు ఇప్పుడు కొత్త విధానానికి ఆమోదముద్ర వేసింది.

Update: 2020-11-05 10:57 GMT

AP Cabinet Approved New Sand Policy : కొత్త ఇసుక పాలసీకి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇసుక విధానంపై ప్రజల నుంచి పెద్దఎత్తున ఫిర్యాదులు వస్తుండటంతో మరోసారి పాలసీని మార్చింది ప్రభుత్వం. ఇప్పటికే పలుమార్లు ఇసుక పాలసీని మార్చిన జగన్ ప్రభుత్వం కేబినెట్ సబ్‌కమిటీ సిఫార్సుల మేరకు ఇప్పుడు కొత్త విధానానికి ఆమోదముద్ర వేసింది. కొత్త పాలసీ ప్రకారం ఇకపై ఆన్‌లైన్‌తోపాటు ఆఫ్‌లైన్‌లోనూ ఇసుక‌ బుకింగ్స్‌ చేసుకోవచ్చని మంత్రి కన్నబాబు తెలిపారు.

అలాగే, నేరుగా ఇసుక రీచ్‌ల‌కు వెళ్లి సొంత వాహనాల్లో తీసుకెళ్లవచ్చని వెల్లడించారు. ఇక, అన్ని ఇసుక రీచ్‌లను ఒకే సంస్థకు అప్పగించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపిన మంత్రి కన్నబాబు మొదట ప్రాధాన్యత ప్రభుత్వరంగ సంస్థకు ఇస్తామన్నారు. ప్రభుత్వరంగ సంస్థలు ముందుకు రాకపోతే టెండర్స్‌కు ఆహ్వానిస్తామన్నారు. అయితే, నిర్ణయించిన రేటు కంటే అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని, ఇసుక అవకతవకలపై ప్రజలు ఎస్‌ఈబీకి ఫిర్యాదు చేయొచ్చని మంత్రి కన్నబాబు ప్రకటించారు.

Tags:    

Similar News