AP Cabinet Expansion: మంత్రులుగా ప్రమాణం చేసిన అప్పలరాజు, వేణుగోపాలకృష్ణ

AP Cabinet Expansion: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ విస్తరణ జరిగింది. రాజ్ భవన్ లో జరిగిన ప్రమాణస్వీకారం కార్యక్రమంలో నూతన మంత్రుల చేత రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచంద్ ప్రమాణం చేయించారు.

Update: 2020-07-22 08:34 GMT
AP Cabinet Expansion

AP Cabinet Expansion: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ విస్తరణ జరిగింది. రాజ్ భవన్ లో జరిగిన ప్రమాణస్వీకారం కార్యక్రమంలో నూతన మంత్రుల చేత రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచంద్ ప్రమాణం చేయించారు. ముందుగా చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ ప్రమాణం చేయగా.. ఆ తరువాత డాక్టర్ సీదిరి అప్పలరాజు ప్రమాణం చేశారు. అనంతరం మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన వీరిని గవర్నర్, ముఖ్యమంత్రి అభినందించారు. కాగా ఈ ఇద్దరు మొదటిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం నుంచి గెలవగా.. సీదిరి అప్పలరాజు శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ.. 2009 లో కాంగ్రెస్ తరఫున జడ్పీటీసీగా పోటీ చేసి తూర్పు గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యారు. ఆ తరువాత వైఎస్ మరణానంతరం కాంగ్రెస్ ను వీడి వైసీపీలో చేరిన వేణు.. 2014 ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున కాకినాడ రురల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆ తరువాత 2019 ఎన్నికల్లో రామచంద్రపురం నుంచి పోటీ చేసి తోట త్రిమూర్తులుపై విజయం సాధించారు. శెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందిన పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో అదే సామాజిక వర్గానికి చెందిన వేణుగోపాల కృష్ణ ఎంపికయ్యారు.

ఇక మరో మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు 2017 లోనే వైసీపీలో చేరారు. మొదటి ప్రయత్నంలోనే పలాస నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మత్సకార సామాజిక వర్గానికి చెందిన మోపిదేవి వెంకటరమణ మంత్రి పదవికి రాజీనామా చేయడంతో అదే సామాజిక వర్గానికి చెందిన సీదిరి అప్పలరాజును ఎంపిక చేశారు. ఆయన చదువులో మంచి ప్రతిభ కనబరిచారు. పదవతరగతిలో రాష్ట్రస్థాయిలో నాలుగో ర్యాంక్ సాధించడంతో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేతుల మీదుగా అవార్డు కూడా పొందారు. 

Tags:    

Similar News