AP Cabinet Approves New Districts Formation Committee: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు కమిటీ

AP Cabinet Approves new districts formation committee: ఆంధ్రప్రదేశ్‌ క్యాబినెట్ సమావేశం ముగిసింది. వెలగపూడిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

Update: 2020-07-15 09:09 GMT
YS Jagan

AP Cabinet Approves New Districts Formation Committee: ఆంధ్రప్రదేశ్‌ క్యాబినెట్ సమావేశం ముగిసింది. వెలగపూడిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు అధ్యయన కమిటీని నియమించాలని.. ఈ మేరకు కమిటీ ఏర్పాటుపై మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ కమిటీకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వం వహిస్తారు. ఈ అధ్యయన కమిటీ.. వచ్చే ఏడాది మార్చి 31వ తేదీలోగా జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేయాలని కేబినెట్‌ నిర్ణయించింది. ఈ కమిటీ ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గం

కేంద్రంగా నూతన జిల్లాలను ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందనే దానిపై అలాగే కొత్త జిల్లాల సాధ్యాసాధ్యాలపై, అదనపు భారంపై ఈ కమిటీకి అధ్యయనం చేయనుంది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో 13 జిల్లాలను పునర్వ్యవస్థీకరించి 25 జిల్లాలు ఏర్పాటు అయ్యే అవకాశం ఉంది. ఇక 26 వ జిల్లా ఏర్పాటుపై కూడా క్యాబినెట్ లో చర్చకు వచ్చింది. కొత్తగా ఏర్పాటు కానున్న అరకు జిల్లా భౌగోళికంగా 4 జిల్లాలలో అంతర్భాగం అయి ఉంది. ఈనేపథ్యంలో అరకును రెండు జిల్లాలు చేసేందుకు అధ్యయనం చేయాలని చీఫ్ సెక్రటరీకి ముఖ్యమంత్రి సూచించారు. కాగా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కొత్త జిల్లాల ఏర్పాటుకు సీఎం వైఎస్‌ జగన్‌ శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే.


Tags:    

Similar News