AP Budget 2021: కోవిడ్‌పై పోరాడుతున్న ఫ్రంట్‌లైన్ వర్కర్లకు సెల్యూట్- గవర్నర్
AP Budget 2021: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశం ప్రారంభమైంది. ఏపీ కేబినెట్ సమావేశం కొద్ది సేపటి క్రితం ముగిసింది.
AP Budget 2021: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశం ప్రారంభమైంది. ఏపీ కేబినెట్ సమావేశం కొద్ది సేపటి క్రితం ముగిసింది. 2021-22 బడ్జెట్‌కు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. కోవిడ్‌ను ఎదుర్కోవడంలో ఏపీ.. దేశానికే ఆదర్శంగా నిలిచిందని గవర్నర్ అన్నారు. దేశవ్యాప్తంగా ఫిబ్రవరి నుంచి కోవిడ్ సెకండ్ వేవ్ ఉద్ధృతంగా ఉందన్నారు.
బడ్జెట్ సెషన్ ముందు గవర్నర్ ప్రసంగం ముఖ్యాంశాలు
- దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉంది
- సెకండ్ వేవ్ లో మరణాలు ఎక్కువుగా ఉన్నాయి
- దేశంలో కరోనా సంక్షోభం కొనసాగుతోంది
- కోవిడ్ సంక్షోభంలోనూ సంక్షేమ పథకాలకు కొనసాగించాం
- కోవిడ్ నివారణలో ఏపీ దేశానికే ఆదర్శం
- కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాం
- ఆరోగ్యశ్రీకి ప్రైవేటు ఆస్పత్రుల్లో 50శాతం బెడ్లు
- 900 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ కావాలని కేంద్రాన్ని కోరాం
- అదనంగా కోవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాం
- ఫ్రంట్ లైన్ వారియర్స్ కు నా సెల్యూట్
- కరోనా వల్ల మరోసారి ఆర్ధిక రంగంపై తీవ్ర ప్రభావం
- ప్రజా సంక్షేమమే ధ్యేయంగా 95శాతం హామీలు పూర్తి చేశాం
- నవరత్నాలు ద్వారా లబ్ధిదారులకే నేరుగా సాయం
- ఆర్థిక వ్యవస్థపై కోవిడ్ దుష్ప్రభావం చూపినప్పటికీ సంక్షేమ పథకాలను కొనసాగించాం.
- ప్రజల సంక్షేమం ప్రాధాన్యతగా 95 శాతం హామీలను పూర్తి చేశాం.
- ఇప్పటి వరకు కోటి 80 లక్షల మంది టెస్టులు చేయగా 14 లక్షల 54 వేల మందికి పాజిటివ్ వచ్చింది.
- ప్రతిరోజూ 590 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను సరఫరా చేశాం.
- జగనన్న విద్యాకానుక కింద 47 లక్షల మందికి విద్యాకానుక అందించాం.
- కరోనా ప్రభావం ఉన్నప్పటికీ దేశ ఆర్థిక వ్యవస్థపై ఏపీ ఆర్థిక పురోగతిని కనబరిచింది.
- 2020-21లో జాతీయ అభివృద్ధి రేటు నెగిటివ్ ఉండగా ఏపీ 1.58 శాతం అభివృద్ధి రేటు కనకబరిచింది.
- రాష్ట్రంలో 53.28 లక్షల మందికి తొలిడోసు ఇచ్చాం. 21.64 లక్షల మందికి సెకండ్ డోసు వ్యాక్సినేషన్ పూర్తయ్యింది.
- వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటింటికి సంక్షేమ పథకాలు
- 44.5లక్షల మంది తల్లులకు జగనన్న అమ్మ ఒడి
- జగనన్న విద్యా కానుక ద్వారా 47లక్షల మందికి కిట్ లు
- రూ.1600కోట్లతో 36.8లక్షల మందికి జగనన్న గోరుముద్ద
- వచ్చే ఏడాది నుంచి సీబీఎస్ విద్యా బోధన
- నాడు- నేడు ద్వారా 15వేల స్కూళ్లలో మరమ్మతులు
- అంగన్ వాడీల ద్వారా పిల్లలకు పౌష్టికాహారం
- విద్యాశాఖకు అన్ని పథకాల కింద రూ.25,714కోట్లు కేటాయింపు
- 108,104 అంబులెన్స్ ల సంఖ్యను పెంచాం
- కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నాం
- ఏపీలో 95శాతం జనాభాకు ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది
- 10,778 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశాం
- రైతులకు 9గంటల నిరంతర ఉచిత విద్యుత్ ఇస్తున్నాం
- అమూల్ తో ఒప్పందం ద్వారా పాడి రైతులకు అదనపు ఆదాయం
- 9250 మొబైల్ వాహనాల ద్వారా ఇంటింటికి రేషన్ పంపిణీ
- అర్హులైన వారందరికీ ఇంటి స్థలాలు ఇచ్చాం
- పేదలకు రెండు దశల్లో ఇళ్లు నిర్మించి ఇస్తాం
- పెన్షన్ల కింద ప్రతి నెల 1వ తేదీనే రూ.1407కోట్లు సాయం
- వైయస్ఆర్ కాపు నేస్తం ద్వారా 419కోట్ల సాయం
- 45ఏళ్లు పైబడిన మహిళలకు రూ.15వేలు సాయం
- సాగునీటి ప్రాజెక్టులకు పూర్తికి అధిక ప్రాధాన్యత
- కర్నూలు ఎయిర్ పోర్టును అందుబాటులోకి తెచ్చాం
- జగనన్న వసతి దీవెనకు రూ.1049కోట్లు కేటాయింపు
- స్కూళ్ల ఆధునీకరణకు రూ.3948కోట్లు కేటాయింపు
- జగనన్న విద్యా దీవెనకు రూ.4879.30కోట్లు కేటాయింపు
- అమ్మ ఒడి పథకానికి రూ.13,022కోట్లు కేటాయింపు