AP Budget 2021: ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా

AP Budget 2021: ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డాయి. కరోనా నేపథ్యంలో ఇవాళ ఒక్కరోజే అసెంబ్లీ, మండలి సమావేశాలు జరిగాయి.

Update: 2021-05-20 11:55 GMT

AP Budget 2021: ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా

AP Budget 2021: ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. కరోనా నేపథ్యంలో ఇవాళ ఒక్కరోజే అసెంబ్లీ, మండలి సమావేశాలు జరిగాయి. 2021 -22 సంవత్సరానికి గానూ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఏపీ బడ్జెట్‌కు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. వన్ డే సమావేశం మొత్తంగా 5గంటల 24 నిమిషాల పాటు జరిగింది. ఈ సమావేశంలో ఏడు బిల్లులకు ఆమోదం తెలిపింది. ఒక బిల్లు ఉపసంహరణకు ఆమోదం తెలిపింది. రెండు తీర్మాణాలు ప్రవేశ పెట్టింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా తీర్మానం చేశారు. కర్నూలు ఎయిర్‌పోర్టుకు ఉయ్యలవాడ నరసింహారెడ్డి పేరు పెట్టాలని తీర్మానం చేశారు.

ఉదయం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగించారు. గవర్నర్ ప్రసంగం తర్వాత శాసనసభలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.. శాసన మండలిలో మంత్రి ధర్మాన కృష్ణదాసు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 2021-22 బడ్జెట్ అంచనా రూ.2,29,779.27 కోట్లు. తొలిసారిగా జెండర్ బడ్జెట్‌ను ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ వార్షిక బడ్జెట్‌లో రూ.47 వేల 283 కోట్లు జెండర్ బడ్జెట్ ప్రవేశపెట్టింది. చిన్నపిల్లలకు చైల్డ్ బడ్జెట్‌లో రూ.16,748.47 కోట్లు ప్రత్యేకంగా కేటాయింపులు చేయడం జరిగింది.

Tags:    

Similar News