19న మరో అల్పపీడనం
మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో ఈనెల 19న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దాంతో అది ఒకరోజులోనే..
మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో ఈనెల 19న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దాంతో అది ఒకరోజులోనే మరింత బలపడే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి తూర్పు మధ్య అరేబియా సముద్రం వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని కూడా చెప్పారు. అలాగే వాయుగుండం ప్రభావంతో రాబోయే 72 గంటల్లో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఇక శుక్రవారం రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి.
మరోవైపు శని, ఆదివారాల్లో తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. ఇక హైదరాబాద్ లో గత రెండు రోజులుగా వర్షం కురవడం లేదు. దాంతో వరద ప్రభావం పూర్తిగా అదుపులోకి వచ్చింది. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నగరంలో ఎక్కడ చూసిన బురద కనిపిస్తుంది. ప్రస్తుతం దీనిని తొలగించేందుకు యంత్రాంగం కృషి చేస్తోంది.