CM KCR : సీఎం కేసీఆర్ నిర్ణయానికి ఏపీ తెలుగుదేశం నాయకులు ఫిదా!
CM KCR : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఏపీ టీడీపీ నేతలు ప్రశంసలు కురిపిస్తున్నారు.. ఎందుకంటే.. ఈ ఏడాది తెలంగాణలో పదో తరగతి
CM KCR : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఏపీ టీడీపీ నేతలు ప్రశంసలు కురిపిస్తున్నారు.. ఎందుకంటే.. ఈ ఏడాది తెలంగాణలో పదో తరగతి పాఠ్యాంశంలో దివంగత నటుడు, నేత ఎన్టీఆర్ జీవిత చరిత్రను చేర్చారు. కొత్తగా రూపొందించిన సిలబస్‌లో పదో తరగతి సాంఘిక శాస్త్రంలో 268 పేజీలో ఎన్టీఆర్ కి సంబంధించిన జీవిత విశేషాలను అందులో పొందుపరిచారు. అయితే సీఎం కేసీఆర్ ఎన్టీఆర్‌పై ఉన్న అభిమానాన్ని ఇలా చాటుకున్నారన్న చర్చ జరుగుతోంది.
సాంఘిక శాస్త్రంలో 268 పేజీలో 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించి అతి తక్కువ కాలంలోనే ముఖ్యమంత్రి అయ్యారని పేర్కొన్నారు. ఎన్టీఆర్ హయాంలో తీసుకొచ్చిన పథకాలను అందులో ప్రస్తావించారు. కిలో బియ్యం రూ.2లకే, మద్యపాన నిషేధం వంటి కార్యక్రమాలు చేపట్టారని వివరించారు.
తెలంగాణా లో అన్న గారి జీవితం పాఠ్యాంశంగా చేర్చడం ఆనందకరం.
— Gorantla butchaiah choudary (@GORANTLA_BC) September 4, 2020
తెలుగుదేశం పుట్టింది తెలంగాణ గడ్డ మీద.అక్కడ ఉన్న పటేల్ పట్వారీ వ్యవస్థ ని తొలగించింది రామరావు గారు🙏#గోరంట్ల
జోహార్ అన్న ఎన్టీఆర్🙏 pic.twitter.com/LU6i4B4ds0
అయితే దీనిపట్ల ఏపీ టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి ట్విట్టర్ వేదికగా స్పందించారు. తెలంగాణా లో అన్న గారి జీవితం పాఠ్యాంశంగా చేర్చడం ఆనందకరం... తెలుగుదేశం పుట్టింది తెలంగాణ గడ్డ మీద.అక్కడ ఉన్న పటేల్ పట్వారీ వ్యవస్థ ని తొలగించింది రామరావు గారు" అంటూ పేర్కొన్నారు. సినీ నటుడుగా ప్రేక్షకుల అభిమానాన్ని అందుకున్న ఎన్టీఆర్... ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి తన పాలనతో ప్రజలను మెప్పించారు.. మొత్తం మూడు సార్లు అయన ముఖ్యమంత్రి పదవిని స్వీకరించారు.