ఏపీలో పది, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు.. అందరూ పాస్

Update: 2020-06-20 11:41 GMT

ఏపీలో కూడా తెలంగాణ రాష్ట్రం లానే, పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసింది. కరోనా వైరస్‌ మహమ్మారి మరింత వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత తరుణంలో పదో తరగతి పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదని తేల్చింది. పది పరీక్షలను రద్దు చేస్తున్నట్టు మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు.

కరోనా భారిన పడకుండా విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి సురేష్ ప్రకటించారు. ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా అన్ని శాఖలను సమన్వయం చేసుకోవడానికి కుదరదని అందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. అలాగే.. ఫెయిల్ అయిన ఇంటర్మీడియట్ విద్యార్థులకు అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు లేకుండా ఇంటర్ మొదటి, రెండో సంవత్సర విద్యార్థులను పాస్ చేస్తున్నట్టు మంత్రి తెలిపారు. 

Tags:    

Similar News