Jagan, Chandrababu Tweet on Dhoni : ధోని రిటైర్మెంట్‌పై సీఎం జగన్, చంద్రబాబు ట్వీట్!
Jagan, Chandrababu Tweet on Dhoni : ఎంఎస్ ధోని.. ఓ గొప్ప ఆటగాడు మాత్రమే కాదు.. జట్టును ముందుకు నడిపించే గొప్ప నాయకుడు కూడా...
Jagan, Chandrababu Tweet on Dhoni : ఎంఎస్ ధోని.. ఓ గొప్ప ఆటగాడు మాత్రమే కాదు.. జట్టును ముందుకు నడిపించే గొప్ప నాయకుడు కూడా... దాదాపుగా 16ఏళ్ళు టీంఇండియా జట్టుకు విశేషమైన సేవలను అందించిన ధోని అందరికి షాక్ ఇస్తూ నిన్న (ఆగస్టు 15)న తన అంతర్జాతీయ క్రికెట్ కి వీడ్కోలు పలికాడు.. వాస్తవానికి గత ఏడాది జరిగిన ప్రపంచకప్ తర్వాత ధోని తన అంతర్జాతీయ క్రికెట్ కి వీడ్కోలు పలుకుతాడని అందరూ అనుకున్నారు. కానీ అలా జరగలేదు.. ప్రపంచకప్ తర్వాత ధోని దాదాపుగా జట్టుకు ఏడాది పాటు దూరంగా ఉన్నాడు. ఇక ఎవరు ఉహించిన విధంగా నిన్న రిటైర్మెంట్ ప్రకటిస్తూ సంచలన నిర్ణయం తీసుకొని అందరికి షాక్ ఇచ్చాడు.. ఇక కేవలం ధోని ఐపీఎల్ లో మాత్రమే ధోని ఆడనున్నాడు..
అయితే ధోని రిటైర్మెంట్ పైన పలువురు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. అందులో భాగంగానే ఏపీ ముఖ్యమంత్రి సీఎం జగన్ ట్విట్టర్ వేదికగా స్పందించాడు. "నీ అద్భుతమైన కెరీర్‌కు అభినందనలు ధోని. మీరు వదిలివేస్తున్న వారసత్వం ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాబోయే తరాల క్రికెట్ ఔత్సాహికులకు స్ఫూర్తినిస్తూ ఉంటుంది. మీ భవిష్యత్ ప్రయత్నాలకు శుభాకాంక్షలు." అంటూ ట్వీట్ చేశాడు జగన్..
Congratulations @msdhoni on a magnificent career. The legacy you are leaving behind will continue to inspire generations of cricket enthusiasts around the world. Best wishes for your future endeavours.
— YS Jagan Mohan Reddy (@ysjagan) August 15, 2020
ఇక ఏపీ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయిడు కూడా ధోని రిటైర్మెంట్ పైన ట్విట్టర్ వేదికగా స్పందించారు. "జీవితంలో ఓ కొత్త ప్రయాణాన్ని మొలుపెట్టబోతున్న ధోనీకి ఆల్ ది బెస్ట్. ఇక నుంచి ధోనీని టీమిండియా జెర్సీలో చూడటాన్ని మిస్సవుతాం. మీరు దేశాన్ని గర్వపడేలా చేశారు. అలాగే ధోనీ ఇచ్చే అత్యుత్తమ క్రికెట్ క్షణాలను కోల్పోతాం ఇక వీడ్కోలు" అని చంద్రబాబు ట్వీట్ చేశారు..
I wish @msdhoni all the best as he embarks on a new journey in life. We will miss you donning the Indian jersey and giving us some of the best cricketing moments. You've made India proud and we value that very much. Farewell #MSDhoni pic.twitter.com/y7LmWH6TL0
— N Chandrababu Naidu #StayHomeSaveLives (@ncbn) August 15, 2020