శాసనమండలి లో టీడీపీ దౌర్జన్యంగా వ్యవహరించింది: మంత్రి బొత్సా

Update: 2020-06-18 13:21 GMT

శాసన మండలిలో టీడీపీ సభ్యులు దౌర్జన్యంగా వ్యవహరించారని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఆయన గురువారం సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు యధాతథంగా..నిన్న కౌన్సిల్ లో సభ జరిగిన తీరు ,టీడీపీ సభ్యుల వ్యవహార శైలి ప్రజాస్వామ్యం లో అందరూ ఖండించాల్సిన పరిస్థితి. సంఖ్యా బలం ఉందని ముందే ఆలోచన చేసుకుని సభని అడ్డుకుని ,నిబంధనలకి విరుద్ధంగా ప్రవర్తించడాన్ని ఖండిస్తున్నాం. డిప్యూటీ చైర్మన్ నిబంధనలకి విరుద్ధంగా రూలింగ్ ఇస్తున్నారు. టీడీపీ సభ్యులని డిప్యూటీ చైర్మన్ మా సభ్యులు అంటూ వెనకేసుకొచ్చారు. టీడీపీ చెప్పిన దానికే ఆయన వత్తాసు పలుకుతున్నారు. ప్రభుత్వ విధానాలకు వారు వ్యతిరేకంగా వెళ్లారు. గత శాసన మండలిలో ఏ విదంగా నిబంధనలని తుంగలో తొక్కరో ఇప్పుడూ అదే జరిగింది

రూల్ 90 అనేది ఆ రోజు ఇవ్వడం కుదరదు ఒక రోజు ముందు ఇవ్వాలని క్లియర్ గా నిబంధనలలో ఉంది. నిబంధనలకు లోబడి అయితే పర్వాలేదు కానీ విరుద్ధంగా వెళ్లారు. ఎంత సహనంగా ఉన్నా మా మీద ఫిజికల్ గా దాడికి సిద్ధపడ్డారు. లోకేష్ సెల్ ఫోన్ పట్టుకుని ఫోటోలు తీస్తున్నాడు గత సెషన్స్ లో ఇదే చేశాడు. మీ వ్యూహాలు ఏమైనా ఉంటే రాష్ట్రానికి పనికి రావాలి ఇలా ఉంటే ఎవరికి ఉపయోగం. బిల్లులు ప్రవేశ పెట్టినప్పుడు ఓటింగ్ పెట్టి ఓడించుకో. ఇలాంటి చవటని ఎలా కన్నావ్ అని అడుగుతున్నాను చంద్రబాబుని. ఒకసారి జరిగితే తెలీదు అనోకోవచ్చు పదే పదే కావాలని లోకేష్ ఫోన్ లో ఫొటోస్ తీసాడు.

ఇలాంటి సంఘటనలు మరలా పునరావృతం కాకూడదని మేము దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం. లేని సంప్రదాయాన్ని ఇప్పటి నుంచి మొదలుపెడదామని డిప్యూటీ చైర్మన్, యనమల అంటున్నారు. చిన్న,పెద్ద గౌరవం తేడా లేకుండా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించారు. మంత్రి పై దాడిని, లోకేష్ ఫోటోల వ్యవహారం పై ఎలాంటి యాక్షన్ తీసుకోవాలో అన్ని చూస్తున్నాం అని మంత్రి బొత్స తెలిపారు.


Tags:    

Similar News