AP Minister, MLAs Corona Positive; ఏపీలో ఇద్దరు ఎమ్మేల్యేలు, ఓ మంత్రికి కరోనా
AP Minister, MLAs Corona Positive: ఆంధ్రప్రదేశ్ లో కరోనా కరాళ నృత్యం చేస్తుంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతుంది. ఈ మహమ్మారికి చిక్కకుండా ఉండేందుకు ఎంత ప్రయత్నిస్తున్నప్పటికీ అది సాధ్యపడటం లేదు.
AP Minister, MLAs Corona Positive: ఆంధ్రప్రదేశ్ లో కరోనా కరాళ నృత్యం చేస్తుంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతుంది. ఈ మహమ్మారికి చిక్కకుండా ఉండేందుకు ఎంత ప్రయత్నిస్తున్నప్పటికీ అది సాధ్యపడటం లేదు. అత్యంత సురక్షితంగా ఉండే రాజకీయ నేతలు,సినీ ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు సైతం ఈ వైరస్ బారిపడుతున్నారు. తాజాగా ఏపీలో ఆ రాష్ట్ర అటవీశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వారం రోజుల నుంచి స్వల్ప జ్వరం ఉండటంతో టెస్టులు చేయగా, తొలుత నెగెటివ్ రాగా, తరువాతి పరీక్షల్లో వైరస్ సోకినట్లు తేలింది. వెంటనే ఆయన చికిత్స కోసం ఆస్పత్రిలో చేరారు.
అలాగే, చీరాల ఎమ్మేల్యే కరణం బలరాంకు కరోనా సోకడంతో హైదరాబాద్‌లోని స్టార్ ఆస్పత్రిలో వైద్యం చేయించుకుంటున్నారు. ఆయన కుమారుడు కరణం వెంకటేశ్‌కు కూడా పాజిటివ్ తెలడంతో హోం క్వారంటైన్‌లో ఉన్నారు. గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబుకు కరోనా పాటు ఆయన భార్యకు కూడా వైరస్ ఉన్నట్లు తేలడంతో ఒంగోలులోని ఒక ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.గడిచిన 24 గంటల్లో 60,576 శాంపిల్స్ పరీక్షించగా.. 10,128 కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 1,86,461కి చేరింది. గత 24 గంటల్లో 8,729మంది కోలుకున్నారు. గడచిన 24 గంటల్లో 77మంది చనిపోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1681కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటికే పలువురు మంత్రులు, అధికార, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు ఈ వైరస్ బారినపడ్డారు.