ఏపీ పంచాయతీ ఎన్నికల పోరు

* వైసీపీకి తలనొప్పిగా మారిన ఎన్నికలు * ఊహించిన స్థాయిలో కాని ఏకగ్రీవాలు * మంత్రులు, ఎమ్మెల్యేలపై పెరిగిన ఒత్తిడి

Update: 2021-02-06 04:12 GMT

Representational Image

ఏపీ పంచాయతీ ఎన్నికల పోరు కొనసాగుతోంది. ఈ ఎన్నికలు అధికార పార్టీకి పెద్ద తలనొప్పిగా తయారయ్యాయి. ఎన్నికల్లో ఊహించిన స్థాయిలో ఏక గ్రీవాలు లేకపోవడంతో మంత్రులు, ఎమ్మెల్యేలుపై మరింత ఒత్తిడి పెరిగింది.

ఎక్కువ గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం చేసే దిశగా పనిచేయాలని పార్టీ నేతలకు సీఎం జగన్ ఆదేశాలను జారీ చేశారు. ఒకపక్క ప్రతిపక్ష పార్టీ నేతలను పోటీ చేయకుండా నిలుపుదల చేయడం, లేదా వారిని తమవైపు తిప్పుకోవడం కోసం అధికార పార్టీ నేతలు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. అందరిని ఏకతాటి మీదకు తెచ్చి ఏకగ్రీవాలు చెయ్యటం పెద్ద టాస్క్... వీరిని బుజ్జగించడానికి మంత్రులు, ఎమ్మెల్యేలు నానా ఇబ్బంది పడుతున్నారు. అయితే మొదటి దశలో ఏకగ్రీవాలు భారీగా జరగలేదు. కనీసం 15 శాతం కూడా లేవు. సగానికి పైగా ఏకగ్రీవాలు వస్తాయని ప్రభుత్వం భావించింది. కానీ వాస్తవ పరిస్థితి అలా లేదు. దీంతో నేతలపై మరింత ఒత్తిడి పెరిగింది.

రాష్ర్టంలో 13 వేలకు పైగా ఉన్న పంచాయతీల్లో మంత్రులు. ఎమ్మెల్యేలు సమన్వయంతో పని చేయాల్సి ఉంది. ఇక ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను జనంలోకి తీసుకెళ్లాలని జగన్ బావిస్తున్నారు. ఇందుకోసం ప్రస్తుతం జరిగే ఎన్నికలు కుడా ఒక పల్స్ లాగా ఉపయోగ పడతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఈ బాధ్యతను కూడా మంత్రులు, ఎమ్మెల్యేలుకు అప్పగించారు.

ఇప్పటికే చిత్తూరు గుంటూరు జిల్లాలలో జరిగిన ఏక గ్రీవాలను ఎస్ఈసి హోల్డ్ లో పెట్టింది. దీనిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఒకపక్క ప్రతిపక్ష పార్టీ విమర్శలను తిప్పి కొట్టడం, మరోపక్క ఎన్నికల కమిషన్ తో యుద్ధం చేయడంతోపాటుగా , సొంత పార్టీలో నేతలను బుజ్జగించడం , గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం చేయడం కోసం ప్రయత్నం చెయ్యటం, అందరిని ఏకతాటి మీదకు తెచ్చి పోటీ లేకుండా చెయ్యటం వైసీపీ నేతలకు అన్నిటికంటే పెద్ద టాస్క్ గా మారింది.

Tags:    

Similar News