Andhra Pradesh: ఎస్ఈసీ నీలం సాహ్నికి ఏపీ హైకోర్టు నోటీసులు
Andhra Pradesh: ఎస్ఈసీ నీలం సాహ్నికి ఏపీ హైకోర్టు నోటీసులు ఇచ్చింది.
Andhra Pradesh: ఎస్ఈసీ నీలం సాహ్నికి ఏపీ హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఎస్ఈసీగా నీలం సాహ్ని నియామకం సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఏపీ ప్రభుత్వంతో పాటు ఎస్ఈసీ నీలం సాహ్నిని.. ఇతర ప్రతివాదులు కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణ ఈనెల 29కి వాయిదా వేసింది. కాగా మార్చి 31న నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పదవీ కాలం ముగియడంతో ఆయన స్థానంలో నీలం సాహ్ని నియామకమయ్యారు. నీలం సాహ్మి ఎస్ఈసీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఏప్రిల్ 8న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరిగాయి. అయితే ఆ ఎన్నికలను హైకోర్టు రద్దు చేసింది. కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని సూచించింది.