Anandayya Medicine: ఆనందయ్య మందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
Anandayya Medicine: ఆనందయ్య మందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Anandayya Medicine: ఆనందయ్య మందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీసీఆర్ఏఎస్ నివేదిక ఆధారంగా ఆనందయ్య మందుకు ప్రభుత్వం అనుమతించింది. ఆనందయ్య ఇచ్చే మందువల్ల హాని లేదని నివేదిక ఇవ్వడంతో సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. ఆనందయ్య మందు వాడినంత మాత్రానా మిగిలిన మందులు ఆపొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.
ఆనందయ్య ఇచ్చే పీ, ఎల్, ఎఫ్ మందులను రోగులు వాడేందుకు ఎటువంటి అభ్యంతరం లేదని ఏపీ ప్రభుత్వం తేల్చి చెప్పింది. అయితే కంట్లో వేసే 'కే' రకం మందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. కే మందుకు సంబంధించి విచారణ రిపోర్టు రానందున, ప్రస్తుతం ఈ మందుకు అనుమతి ఇచ్చేందుకు నిరాకరించింది. కంట్లో వేసే చుక్కల మందుకు సంబంధించి నివేదిక రావడానికి మరో రెండు నుంచి మూడు వారాల సమయం పట్టే అవకాశం ఉంది. ఆ నివేదిక పరీశీలించిన అనంతరం కే రకం మందుపై నిర్ణయం తీసుకోనున్నారు.