YSR Health Clinics: సొంత భవనాల్లోనే వైఎస్సార్ హెల్త్ క్లినిక్ లు.. వేగంగా పనులు!

YSR Health Clinics | ఏదైనా దేశం, రాష్ట్రం చివరకు కుటుంబమైనా అభివృద్ధి సాధించాలంటే అందరూ ఆరోగ్యంగా ఉండాల్సిన అవసరం ఉంది.

Update: 2020-09-10 02:32 GMT

YSR Health Clinics | ఏదైనా దేశం, రాష్ట్రం చివరకు కుటుంబమైనా అభివృద్ధి సాధించాలంటే అందరూ ఆరోగ్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. అలా కాకుండా అనారోగ్యంతో నిత్యం ఇబ్బందులు పడుతుంటే అభివృద్ధి అనేది కానరాని పరిస్థితి ఉంటుంది. అందుకే ఏపీ ప్రభుత్వం చిన్నారులతో పాటు బాలింతలు, గర్బిణీలు ఆరోగ్యంగా ఉంచాలని భావించి, పలు పథకాలను అమల్లోకి తెచ్చింది. ఈ విధంగానే గ్రామీణ వైద్యం రూపురేఖలు మర్చి, ప్రజలకు ఇంటి ముంగిటకే వైద్యం అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేస్తున్న వైఎస్సార్‌ క్లినిక్‌లను ఏడాదిలోగా పూర్తి చేయాలని వైద్య ఆరోగ్యశాఖను ఆదేశించారు.

అయితే, రాష్ట్రవ్యాప్తంగా 7,458 కేంద్రాలు ఉన్నాయని.. ప్రస్తుతం వీటిలో ఉన్న ఆరోగ్య కేంద్రాల్లో సుమారు 80 శాతం వరకు సోన భవనలు లేవు. కొన్ని కేంద్రాలు చిన్న గుడిసెల్లో మరికొన్ని కూలిపోయే దశలో ఉన్నాయి. ఈ పరిస్థితులను గమనించి అన్ని ఆరోగ్య కేంద్రాలు పూర్తి సదుపాయాలతో ప్రభుత్వ భవనాల్లోనే ఉండాలని సీఎం వైద్య అధికారులకు ఆదేశాలు జరీ చేసారు. దీంతో ఆరోగ్య శాఖ నూతన భావనల నిర్మాణం చేపట్టింది. అంతే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 10,000 లకు పైగా హెల్త్‌ క్లినిక్‌లు ఏర్పాటు చేయనున్నారు. ఇందులో భాగంగానే 8,724 కేంద్రాల్లో పనులు ఇప్పటికే మొదలయ్యాయి అని అధికారులు వెల్లడించారు.

హెల్త్‌ క్లినిక్‌లు అందుబాటులోకి వస్తే...

* చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకూ దూరంగా ఉండే పీహెచ్‌సీకి వెళ్లాల్సిన అవసరం ఉండదు.

* ప్రస్తుతం ఉన్న ఏఎన్‌ఎం కూడా అందుబాటులో ఉంటుంది.

* ప్రతి 2,500 మందికి ఒక ఆరోగ్య కేంద్రం అందుబాటులో ఉంటుంది

* ప్రతి క్లినిక్‌లోనూ బీఎస్సీ నర్సింగ్‌ అర్హత కలిగిన మిడ్‌లెవెల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌ను నియమిస్తారు.

* గర్భిణులు, బాలింతలు, చిన్నారులు ఇక్కడే టీకాలు వేయించుకోవచ్చు.

* అన్నిరకాల టీకాలు ఇక్కడే అందుబాటులో ఉంటాయి.

* తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 1,100 వైఎస్సార్‌ విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లు నిర్మిస్తున్నారు.   

Tags:    

Similar News