AP Govt. Announces 13 Model Degree Colleges: ఏపీలో రూ.40 కోట్ల వ్యయం.. 13 మోడల్ డిగ్రీ కాలేజీలు
AP Govt. Announces 13 Model Degree Colleges: ఏపీలో నాడు-నేడు ద్వారా పాఠశాలలకు జవసత్వాలు తీసుకొస్తున్న ప్రభుత్వం.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రూ.40 కోట్లతో 13 మోడల్ డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చెయ్యాలని నిర్ణయించింది. ఇందులో జిల్లాకో కాలేజీని ఎంపిక చేశారు. మోడల్ డిగ్రీ కాలేజీల ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి జిల్లాలోనూ ఒక డిగ్రీ కాలేజీని మోడల్ కళాశాలగా తీర్చి దిద్డాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. నేషనల్ ఇన్స్‌టిట్యూషనల్ ఫ్రేమ్ వర్క్(ఎస్ఎఆర్ఎఫ్)కు పైలెట్ ప్రాజెక్టుగా వీటిని ఎంపిక చేసింది రాష్ట్ర ప్రభుత్వం.ఇందుకోసం రూ.40.62 కోట్లు ఖర్చు చేస్తారు.
ఇందులో భాగంగా అనంతపురంలో పురుషుల డిగ్రీ కాలేజీ, చిత్తూరులో పీవీకేఎన్, కర్నూలులోని సిల్వర్ జూబ్లీ డిగ్రీ కాలేజీ, కడపలో పురుషుల డిగ్రీ కాలేజీ, ఒంగోలులో మహిళా డిగ్రీ కాలేజీ, నెల్లూరులోని డీకేడబ్ల్యూ కాలేజీ, గుంటూరులో మహిళా డిగ్రీ కాలేజీ, కృష్ణా జిల్లా విజయవాడలోని ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ కాలేజీ, పశ్చిమ గోదావరి జిల్లా తణుకులోని ఎసీఐఎం, తూర్పు గోదావరి జిల్లాలో రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ కాలేజీ (ఏ), విశాఖలో డాక్టర్ వీఎస్ కృష్ణా జీడీసీ, విజయనగరం జిల్లా సాలూరులోని జీడీసీ, శ్రీకాకుళంలోని జీడీసీ (ఎం), కాలేజీలను ఎఆర్ఎఫ్ పైలెట్ ప్రాజెక్టుకు ఎంపిక చేశారు.