AP Border E Pass: ఏపీ సరిహద్దు వద్ద సడలించిన నిబంధనలు..

AP Border E Pass: కరోనా వైరస్ మరింత వ్యాపిస్తున్నా తప్పనిసరి పరిస్థితుల్లో దేశ వ్యాప్తంగా కొన్ని సడలింపులు ఇచ్చింది.

Update: 2020-08-02 01:15 GMT

AP Border E Pass: కరోనా వైరస్ మరింత వ్యాపిస్తున్నా తప్పనిసరి పరిస్థితుల్లో దేశ వ్యాప్తంగా కొన్ని సడలింపులు ఇచ్చింది. ప్రస్తుతం దేశంలో అన్ లాక్ 3.0 అమల్లో ఉన్నందున అన్ని రాష్ట్రాలు పాక్షికంగా కొన్ని సడలింపులు చేశారు. దీనిలో భాగంగా ఏపీలోకి వచ్చే వారి కోసం సరిహద్దుల్లో కొన్ని నిబందనలు సడలిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనికి ముందుగా ధరఖాస్తు చేసి ఈ పాస్ తీసుకుంటే దాని ద్వారా చిరునామా ఇతర వివరాలు నమోదయ్యే అవకాశం ఉంటుంది. దీనివల్ల భవిషత్తులో వారి ఆరోగ్య పరిస్థితిపై విచారణ చేసి, తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని భావనతో ఈ చర్యలు తీసుకున్నారు.

దేశ వ్యాప్తంగా అన్‌లాక్‌ 3.0 ప్రారంభమైంది. దీంతో ఏపీ సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద నిబంధనలు సడలించారు. అన్‌లాక్‌ 3.0 నిబంధనల ప్రకారం ఏపీ సరిహద్దు చెక్‌ పోస్టుల్లో ప్రభుత్వం ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చే వారికి ఆంక్షలు సడలించారు. ఈ సందర్భంగా కోవిడ్‌–19 టాస్క్‌ఫోర్సు కమిటీ చైర్మన్‌ ఎంటీ కృష్ణబాబు మాట్లాడుతూ.. పొరుగు రాష్ట్రాల నుంచి ఏపీకి రావాలంటే 'స్పందన' వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆయన ఇంకా ఏం తెలిపారంటే..

► దరఖాస్తు చేసుకున్న వెంటనే ఆటోమేటిక్‌గా ఈ–పాస్‌ మొబైల్, ఈ మెయిల్‌కి వస్తుంది.

► అంతర్రాష్ట్ర సరిహద్దు వద్ద సిబ్బందికి ఈ–పాస్‌తో పాటు గుర్తింపు కార్డును చూపిస్తే రాష్ట్రంలోకి అనుమతిస్తారు.

► ఈ–పాస్‌ వివరాల్ని చెక్‌ పోస్టులో నమోదు చేయించుకుని ఏపీలోకి రావచ్చు.

► ఈ నమోదు, వచ్చేవారి సంఖ్యను గుర్తించేందుకు మాత్రమే. ఈ సమాచారాన్ని ఆరోగ్య కార్యకర్తలకు పంపుతారు.

► ఆరోగ్య కార్యకర్తలు ఏపీకి వచ్చే వారి ఆరోగ్యంపై దృష్టి సారిస్తారు. నేటి (ఆదివారం) నుంచి ఈ విధానం అమలులోకి వస్తుంది.

► సరిహద్దు చెక్‌పోస్టుల్లో ఈ–పాస్‌ చూపించకపోతే పోలీసులు వెనక్కు తిప్పి పంపుతారు.

► ఈ–పాస్‌ దరఖాస్తు www.spandana.ap. gov.in వెబ్‌సైట్‌లో ఉంటుంది.


Tags:    

Similar News