YS Jagan Visits Tirumala: శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఏపీ సీఎం జగన్...
YS Jagan Visits Tirumala | తిరుమల శ్రీవారికి ఏపీ సీఎం వైఎస్ జగన్ పట్టు వస్త్రాలు సమర్పించారు.
YS Jagan Visits Tirumala | తిరుమల శ్రీవారికి ఏపీ సీఎం వైఎస్ జగన్ పట్టు వస్త్రాలు సమర్పించారు. మహాద్వారం ద్వారా ఆలయ ప్రవేశం చేసిన జగన్.. పంచకట్టు, తిరునామంతో శ్రీవారి సేవలో పాల్గొన్నారు. అనంతరం బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారి గరుడ సేవలో పాల్గొన్నారు. అంతకుముందు బీడీ ఆంజనేయస్వామి ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నిన్న ఢిల్లీ పర్యటనకు వెళ్లిన జగన్ అక్కడి నుంచి నేరుగా తిరుపతికి చేరుకున్నారు. అనంతరం తిరుమలకు చేరుకున్న ఆయనకు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు కొడాలి నాని, వెల్లంపల్లి తదితరులు స్వాగతం పలికారు. ఈ రాత్రికి తిరుమలలోనే బస చేసి రేపు ఉదయం కర్ణాటక సీఎం యడియూరప్పతో కలిసి మళ్లీ శ్రీవారిని దర్శించుకుంటారు. అనంతరం సీఎం అమరావతికి పయనమవుతారు.